తమిళ స్టార్ డైరెక్టర్ వెంకట్ ప్రభు( Director Venkat Prabhu ) గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు.కోలీవుడ్ లో మొదట నటుడిగా కెరిర్ ని మొదలు పెట్టారు.
నటుడిగా తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును ఏర్పరచుకున్న వెంకట్ ప్రభు ఆ తర్వాత ప్లే బ్యాక్ సింగర్ గా కూడా గుర్తింపు తెచ్చుకున్నారు.అలాగే కోలీవుడ్ లో డైరెక్టర్ గా పలు సినిమాలను తెరకెక్కించి మంచి గుర్తింపు తెచ్చుకున్న విషయం తెలిసిందే.
ప్రస్తుతం డైరెక్టర్ కొనసాగుతున్న వెంకట్ తాజాగా తెలుగులో దర్శకత్వం వహించిన సినిమా కస్టడీ.( Custody ) నాగచైతన్య ( Naga Chaitanya ) హీరోగా నటించిన ఈ సినిమాను తెలుగు తమిళ భాషల్లో విడుదల చేసిన విషయం తెలిసిందే.

భారీ అంచనాల నడుమ విడుదలైన ఈ సినిమా ఊహించని విధంగా డిజాస్టర్ గా నిలిచింది.ఈ సినిమాపై అక్కినేని అభిమానులు కూడా భారీగా అంచనాలు పెట్టుకున్నారు.కానీ ఈ సినిమా ఆ అంచనాలను అందుకోలేకపోయింది.విడుదలైన మొదటి రోజే ఈ సినిమా నెగిటివ్ టాక్ ని సొంతం చేసుకుంది.అయితే ఈ సినిమా ఫ్లాప్ అయినందుకు అక్కినేని అభిమానులు బాధపడుతుండగా ప్రభాస్ అభిమానులు( Prabhas Fans ) మాత్రం సంతోషపడుతున్నారు.అయితే ప్రభాస్ అభిమానులకు నాగచైతన్య పై కోపం కాదు.
డైరెక్టర్ వెంకట్ ప్రభు పై కోపంతో పండగ చేసుకుంటున్నారు.

దాంతో ప్రభాస్ ఫ్యాన్స్ ఆయనపై భారీగా ట్రోల్స్ చేస్తున్నారు.అందుకు గల కారణం కూడా లేకపోలేదు.ప్రభాస్ నటించిన సాహో సినిమా సమయంలో వెంకట్ ప్రభు చేసిన వాఖ్యలే అందుకు కారణం.
ప్రభాస్ నటించిన సాహో సినిమా విడుదల అయ్యి మొదటి రోజే నెగటివ్ టాక్ ని సొంతం చేసుకున్న విషయం తెలిసిందే.ప్రభాస్ అభిమానులు ఈ సినిమా ఫలితాలపై భారీగా నిరాశ చెందారు.
ఆ సమయంలో ట్విట్టర్ వేదికగా సాహో సినిమా ఫ్లాప్ అవ్వడానికి తాను ఆనందిస్తున్నట్లుగా ఇన్ డైరెక్ట్ గా ట్విట్ చేశారు.ఆ విషయాన్ని గుర్తు పెట్టుకున్న ప్రభాస్ అభిమానులు ఇప్పుడు కస్టడీ సినిమా ఫ్లాప్ విషయాన్ని తెరపైకి తీసుకువస్తూ వెంకట్ ప్రభు పై దారుణంగా ట్రోల్స్ చేస్తూ నెగిటివ్ కామెంట్స్ చేస్తున్నారు.
కర్మ ఎవరిని వదలదు అంటూ వెంకట్ ప్రభు ని ఉద్దేశించి కామెంట్లు చేస్తున్నారు.







