తెలుగుదేశం పార్టీ( TDP ) ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్( Nara Lokesh ) యువగళం( Yuvagalam ) పేరుతో పాదయాత్ర చేపట్టి 100 రోజులు పూర్తి అయింది.ఈ ఏడాది జనవరి 27 కుప్పం నియోజిక వర్గంలో ప్రారంభం అయిన పాదయాత్ర ఇప్పటివరకు 34 నియోజిక వర్గాల్లో 1269 కిలోమీటర్ల మేర సాగింది.
అయితే లోకేశ్ పాదయాత్ర ప్రారంభించిన మొదట్లో వైసీపీ నేతల నుంచి ఎన్నో విమర్శలు ఎదుర్కొన్నారు.అది పాదయాత్ర కాదని శవయాత్ర అని కేవలం టైమ్ పాస్ కు మాత్రమే లోకేశ్ పాదయాత్ర చేస్తున్నారని, ఈ పాదయాత్ర టీడీపీకి ఒరిగేదెమి లేదని ఇలా రకరకాల విమర్శలు వినిపించాయి.

అయితే వీటన్నిటికి దాటుకొని నారా లోకేశ్ వందరోజుల పాదయాత్ర ను పూర్తి చేసుకున్నారు.కాగా ఈ పాదయాత్ర వల్ల టీడీపీకి ఏమైనా మంచి జరిగిందా ? అసలు లోకేశ్ లో వచ్చిన మార్పు ఏంటి అనే దానిపై రాజకీయ విశ్లేషకులు వారియొక్క అభిప్రాయాన్ని వెళ్ళబుచ్చుతున్నారు.గతంతో పోల్చితే పాదయాత్ర కారణంగా లోకేశ్ లో వాక్ధాటి మెరుగుపడిందనేది అందరినోట వినిపిస్తున్న మాట.గతంలో లోకేశ్ ప్రత్యర్థి పార్టీ నేతలపై విమర్శలు గుప్పించడంలో తడబాటు చూపించే వారు.దాంతో ఆయన వ్యాఖ్యలలో మెచ్యూరిటీ లేదని, ఆయన పప్పు అంటూ నానా నిందలు వేసేవారు వైసీపీ నేతలు.ఇప్పుడు అలాంటి పరిస్థితి లేదు.

వైసీపీ నేతలపై స్పష్టమైన విమర్శలు గుప్పిస్తూ.ప్రభుత్వ వైఫల్యాలను ప్రజలకు చెబుతూ వైసీపీకి గట్టిగానే స్ట్రోక్ ఇస్తున్నారు లోకేశ్.దీంతో ఒకప్పుడు పప్పు అని హేళన చేసిన నేతలే.ఇప్పుడు లోకేశ్ చేస్తున్న ఆరోపణలకు వివరణ ఇవ్వాల్సిన పరిస్థితి ఏర్పడింది.ఇక పార్టీ పరంగా కూడా లోకేశ్ చూపిస్తున్న దూకుడు టీడీపీ శ్రేణుల్లో కొత్త ఉత్సాహాన్ని నింపుతోంది.గతంలో లోకేశ్ నాయకత్వంపై సందిగ్దంగా ఉన్న టీడీపీ శ్రేణులే ఇప్పుడు లోకేశ్ ను భవిష్యత్ టీడీపీ నాయకుడిగా అంగీకరిస్తున్నారు.
పాదయాత్రలో భాగంగా ప్రజల్లో మమేకం అవుతూ.తాము అధికారంలోకి వస్తే ఏం చేస్తామో స్పష్టమైన వివరణ ఇస్తూ అందరి దృష్టిని ఆకర్షిస్తున్నారు లోకేశ్.
దీంతో గతంలో ఉన్న లోకేశ్ కి.ప్రస్తుత లోకేశ్ కి చాలానే వ్యత్యాసం ఉందని రాజకీయ వాదులు చెబుతున్నా మాట.మొత్తానికి నారా లోకేశ్ చేపట్టిన యువగళం పాదయాత్ర ద్వారా తనను తాను మలుచుకున్నాడనే చెప్పాలి.







