14 ఏళ్లుగా భోజనం చేయలేదు.. ప్రముఖ నటుడి సంచలన వ్యాఖ్యలు వైరల్!

టాలీవుడ్, బాలీవుడ్ ఇండస్ట్రీలలో నటుడిగా తనకంటూ ప్రత్యేక గుర్తింపును సొంతం చేసుకున్న వాళ్లలో మనోజ్ బాజ్ పాయ్(Manoj Bajpayee ) ఒకరు.నెగిటివ్ షేడ్స్ ఉన్న పాత్రల్లో, విలన్ పాత్రల్లో ఎక్కువగా నటించిన ఈ నటుడు తాజాగా ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ షాకింగ్ విషయాలను వెల్లడించారు.

 Manoj Bhajapayee Comments Goes Viral In Social Media Details Here ,manoj Bhaja-TeluguStop.com

ఫ్యామిలీ మ్యాన్2 వెబ్ సిరీస్( The family man 2 ) ద్వారా పాన్ ఇండియా స్థాయిలో మనోజ్ బాజ్ పాయ్ గుర్తింపును సొంతం చేసుకున్నారు.

గత కొన్నేళ్లలో తన జీవన విధానం పూర్తిస్థాయిలో మారిపోయిందని ఆయన తెలిపారు.

గడిచిన 14 సంవత్సరాలుగా నేను రాత్రిపూట భోజనం చేయడం లేదని మనోజ్ అన్నారు.దీనివల్ల బరువు అదుపులో ఉందని ఆయన కామెంట్లు చేశారు.

ఈ విధంగా చేయడం వల్ల నా బరువు కంట్రోల్ లో ఉందని ఆయన పేర్కొన్నారు.మా తాత దగ్గరినుంచి నేను ఈ లక్షణాన్ని నేర్చుకున్నానని మనోజ్ బాజ్ పాయ్ అభిప్రాయపడ్డారు.

మా తాత కూడా రాత్రి సమయంలో భోజనం చేసేవారు కాదని ఆయన తెలిపారు.మా తాత ఫిట్ గా, సన్నగా ఉత్సాహంగా ఉండేవారని మనోజ్ బాజ్ పాయ్ వెల్లడించడం గమనార్హం.ఆ రీజన్ వల్లే నేను కూడా మా తాతను ఫాలో కావడం జరిగిందని ఆయన అభిప్రాయం వ్యక్తం చేశారు.రాత్రి సమయంలో భోజనం మానేయడం అంటే మొదట చాలా కష్టంగా అనిపించేదని ఆయన పేర్కొన్నారు.

ఆకలిని కంట్రోల్ చేయడానికి బిస్కెట్లు తినేవాడినని క్రమక్రమంగా అలవాటు చేసుకున్నానని మనోజ్ వెల్లడించారు.ఈ అలవాట్ల వల్ల ఎనర్జీతో ఉండటంతో పాటు బరువును అదుపులో ఉంచుకోగలుగుతానని ఆయన అభిప్రాయపడ్డారు.త్వరలో ఈ నటుడు ఫ్యామిలీ మ్యాన్ సీజన్3 లో పాల్గొననున్నారని సమాచారం అందుతోంది.మనోజ్ బాజ్ పాయ్ వెల్లడించిన విషయాలు సోషల్ మీడియా( Social media )లో తెగ వైరల్ అవుతున్నాయి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube