తెలుగు సినీ ప్రేక్షకులకు హీరోయిన్ అదా శర్మ( Adah Sharma ) గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు.టాలీవుడ్ హీరో నితిన్ నటించిన హార్ట్ ఎటాక్ సినిమాతో తెలుగు సినిమా ఇండస్ట్రీ హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది ఈ ముద్దుగుమ్మ.
ఆ తర్వాత తెలుగులో పలు సినిమాల్లో నటించినప్పటికీ ఈ ముద్దుగుమ్మకు ఆశించిన స్థాయిలో గుర్తింపు దక్కలేదు.ఇది ఇలా ఉంటే అదా శర్మ తాజాగా నటించిన చిత్రం ది కేరళ స్టోరీ.
( The Kerala story ) ఈ సినిమా యముడు తన విడుదల అయిందో కానీ అప్పటినుంచి వరుసగా వివాదాలు వెంటాడుతూనే ఉన్నాయి.
ఈ సినిమాను విమర్శిస్తున్న వారు ఎంతమంది ఉన్నారో సపోర్ట్ చేస్తున్న వారు కూడా అంతే మంది ఉన్నారు.
ఈ సినిమా నిజ జీవిత సంఘటనల ఆధారంగా జరిగిందని చాలామంది మద్దతు పలుకుతున్నారు.ఇది ఇలా ఉంటే ఈ సినిమాతో ఆదాశర్మ క్రేజ్ విపరీతంగా పెరిగిపోయింది.ఇంతకుముందు వరుస సినిమాలలో నటించినప్పటికీ రాని గుర్తింపు ఈ ఒక్క సినిమాతో దక్కింది.ఈ సినిమాతో భారీగా పాపులారిటీని సంపాదించుకోవడంతో పాటు దేశవ్యాప్తంగా వార్తల్లో నిలుస్తోంది ఈ ముద్దుగుమ్మ.
దీంతో కాంట్రవర్సీ కాస్త ఆమెకు బాగా కలిసి వచ్చింది.
ఈ సినిమాలో అద్భుతంగా నటించడంతో పలువురు ప్రముఖులు ప్రశంసలు కురిపిస్తున్నారు.ఇది ఇలా ఉంటే తాజాగా ఈ ముద్దుగుమ్మకు సంబంధించిన ఒక వార్తా సోషల్ మీడియాలో చెక్కర్లు కొడుతుంది.అదేంటంటే అదా శర్మ ఆస్తులకు( Adah Sharma Assets ) సంబంధించి వార్తలు వినిపిస్తున్నాయి.
ఆ విషయానికి వస్తే.అదాశర్మకు ఖరీదైన కార్లు అంటే చాలా ఇష్టం.
ఇప్పటికే ఆమెకు చాలా లగ్జరీ కార్లు కూడా ఉన్నాయి.భారతదేశంలో ఖరీదైన కార్లను కొనుగోలు చేసింది.
అంతేకాకుండా ఆదాశర్మకు ముంబైలో విలాసవంతమైన ఇల్లు కూడా ఉంది.ఆమె నివసించే బంగ్లా విలువ కోట్లలో ఉంటుందని తెలుస్తోంది.అంతేకాకుండా ఈ ముద్దుగుమ్మ పేరు మీద కోట్లలో ఆస్తులు ఉన్నాయి.తాజాగా విడుదలైన ది కేరళ స్టోరీ సినిమాకు గాను ఈ ముద్దుగుమ్మ కోటి రూపాయల ఇమ్యూనరేషన్ కూడా అందుకుంది.
అలా మొత్తంగా కలుపుకుంటే ఈ ముద్దుగుమ్మ నికర ఆస్తుల విలువ దాదాపుగా 10 కోట్ల వరకు ఉంటుందని తెలుస్తోంది.