నాచురల్ బ్యూటీ సాయి పల్లవి ( Sai Pallavi )మే 9వ తేదీ 31వ పుట్టినరోజు వేడుకలను జరుపుకున్నారు.ఈ క్రమంలోని ఈమె పుట్టినరోజు సందర్భంగా అభిమానులు పెద్ద ఎత్తున సోషల్ మీడియా వేదికగా శుభాకాంక్షలు తెలియజేశారు.
సాయి పల్లవి పుట్టినరోజు సందర్భంగా తన చెల్లెలు పూజా కన్నన్( Pooja Kannan ) సోషల్ మీడియా వేదికగా సాయి పల్లవికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తూ చేసినటువంటి పోస్ట్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.సాయి పల్లవి చెల్లెలు పూజ చేసిన పోస్ట్ కనుక చూస్తే తనకు సాయి పల్లవి అంటే ఎంత ప్రేమో అర్థమవుతుంది.

ఈ క్రమంలోనే పూజ తన అక్కతో కలిసి దిగినటువంటి ఫోటోని సోషల్ మీడియా వేదికగా షేర్ చేస్తూ.ఈరోజు నేను నిన్ను చాలా మిస్ అవుతున్నాను.నా పక్కన నువ్వు లేనందుకు నీ పక్కన నేను లేనందుకు చాలా బాధగా ఉంది.నిన్ను ఇరిటేట్ చేయడం నిన్ను గిచ్చడం నీ మొహం ఎర్రగా మారితే చూడటం మిస్ అవుతున్నానని తెలియజేశారు.
నీతో కలిసి కూర్చొని నవ్వడం మిస్ అవుతున్నాను నువ్వు నాకంటే ముందుగా పుట్టి నేను మోయాల్సిన నిందలన్నీ నువ్వు మోస్తున్నావు.ఈ విషయాలన్నీ పక్కన పెట్టేస్తే నువ్వు నాకోసం చేసిన త్యాగాలను నేను మర్చిపోలేను.

నన్ను బాధ పెట్టే విషయాల నుంచి ఎప్పుడు రక్షిస్తూ ఉంటావు.నాలోని బెస్ట్ ఇవ్వడం కోసం నువ్వు ఎప్పుడు ప్రోత్సహిస్తూనే ఉంటావు నువ్వు చేసిన త్యాగాలకు ఎప్పటికీ రుణపడి ఉంటాను.నువ్వు నా అక్కగా దొరకడం నా అదృష్టం ప్రేమకు స్వచ్ఛతకు నువ్వే ప్రతిరూపం హ్యాపీ బర్త్డే మై ఫ్రెండ్ అంటూ కామెంట్స్ చేస్తూ తన అక్క పై తనకు ఎంత ప్రేమ ఉందో బయట పెట్టారు.ఇలా సాయి పల్లవి గురించి తన చెల్లెలు ఎమోషనల్ అవుతూ బర్త్ డే విషెస్ చెప్పడంతో సాయి పల్లవి స్పందిస్తూ లవ్ యు అంటూ కామెంట్ పెట్టారు.
ప్రస్తుతం ఈ ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.







