తెలంగాణ ఇంటర్ ఫలితాలు ఇవాళ విడుదల అయ్యాయి.ఈ మేరకు రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి నాంపల్లి ఇంటర్ బోర్డు కార్యాలయంలో రిజల్ట్స్ ను ప్రకటించారు.
ఒకేసారి ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్ పరీక్షా ఫలితాలను విడుదల చేశారు.
ఈ సంవత్సరం ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం విద్యార్థులు 63.85 శాతం మంది ఉత్తీర్ణత సాధించారు.రెండవ సంవత్సరం విద్యార్థులు 67.26 శాతం మంది ఉత్తీర్ణులు అయ్యారు.కాగా ఈ ఏడాదిలో మొత్తం 9.06 లక్షల మంది విద్యార్థులు ఇంటర్ పరీక్షలు హాజరయ్యారు.







