నందమూరి బాలకృష్ణ ( Nandamuri Balakrishna ), బోయపాటి శ్రీను ( Boyapati Srinu ) కాంబినేషన్‌లో అఖండ 2 సినిమా రాబోతున్నట్లు ఇప్పటికే వార్తలొస్తున్నాయి.అఖండ సినిమాకు సీక్వెల్ స్క్రిప్ట్ కూడా ఆల్ రెడీ పూర్తి అయింది అని కూడా టాక్.
వచ్చే నెల జూన్ 10న బాలయ్య పుట్టినరోజును పురస్కరించుకుని ‘అఖండ 2’ చిత్రాన్ని అధికారికంగా ప్రారంభించనున్నారని అన్నారు.అయితే, తాజాగా బాలయ్య – బోయపాటి సినిమా గురించి మరో అప్ డేట్ వినిపిస్తోంది.
పాలిటిక్స్ నేపథ్యంలో ఈ సినిమా చేసే అవకాశాలున్నాయట.ఏపీలోని రాజకీయ పరిస్థితులు ఆధారంగా సినిమా చేస్తారట.

ఈ సినిమాతోనే రాజకీయ లా మీద బాలయ్య సెటైర్ వేయబోతున్నట్టు తెలుస్తుంది…ఇక ఈ సినిమా స్టోరీ ని ఇప్పటికే బాలయ్య ముందు ఉంచారట…బాలయ్య కూడా ఈ స్టోరీ కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు గా తెలుస్తుంది…పైగా ఈ పొలిటికల్ మూవీని 2024 ఎన్నికలకు ముందు రిలీజ్ చేయాలని చూస్తున్నారు.ముఖ్యంగా సినిమాలో విలన్ కూడా జగన్ బాడీ లాంగ్వేజ్ కి సరిపడే పాత్రతోనే సాగుతుందట.మొత్తానికి బోయపాటి ఈ సినిమా కథని పొలిటికల్( political ) వార్ గా ప్లాన్ చేశాడు.ఏది ఏమైనా అఖండ తర్వాత బాలయ్య – బోయపాటి కాంబినేషన్ లో సినిమా వస్తుండటంతో.
ఈ సినిమా పై భారీ అంచనాలు ఉంటాయి.

ప్రస్తుతం బాలయ్య అనిల్ రావిపూడి ( Anil Ravipudi )సినిమా చేస్తున్నాడు అలాగే బోయపాటి రామ్ తో ఒక సినిమా చేస్తున్నాడు ఇవి రెండు తొందర్లోనే పూర్తి చేసుకొని వీళ్లిద్దరి కాంబో సెట్ చేసుకునే ప్రాసెస్ లో ఉన్నట్టు తెలుస్తుంది…ఇక ఈ న్యూస్ విన్న నందమూరి అభిమానులు ఫుల్ హ్యాపీ గా ఉన్నట్టు తెలుస్తుంది…ఇక వీళ్ళ కాంబో లో వచ్చిన మూడు సినిమాలు వరుస సినిమాలు రావడం అవి బ్లాక్ బస్టర్స్ కొట్టడం మనకు తెలిసిందే ఇక ఈ సినిమాతో మరో మారు వీళ్ళ సత్తా ఏంటో చూపించబోతున్నారు…
.







