వ్యవస్థలో మార్పు తీసుకొచ్చేందుకే ‘జగనన్నకు చెబుదాం’ అనే కార్యక్రమానికి శ్రీకారం చుట్టామని సీఎం జగన్ తెలిపారు.గత పాలనలో అడుగడుగునా వివక్ష ఉండేదని విమర్శించారు.
వైసీపీ పాలనలో ఎటువంటి వివక్షకు తావులేదన్న సీఎం జగన్ ఫిర్యాదుల పరిష్కారానికి ప్రత్యేక వ్యవస్థను తీసుకొచ్చామని తెలిపారు.ఇప్పటికే స్పందన ద్వారా ఫిర్యాదులు స్వీకరిస్తున్నామన్నారు.
అయితే ఆ సమస్యలు పరిష్కారం కాకుంటే వెంటనే ఫోన్ చేయొచ్చని పేర్కొన్నారు.ఫిర్యాదు చేసిన వెంటనే ఐడీ కేటాయింపు ఉంటుందని, ఐవీఆర్ఎస్, ఎస్ఎంఎస్ ద్వారా కంప్లైంట్ స్టేటస్ తెలుస్తుందని వెల్లడించారు.
అంతేకాకుండా ఫిర్యాదును ప్రత్యక్షంగా సీఎం కార్యాలయం పర్యవేక్షిస్తుందని స్పష్టం చేశారు.







