కన్నడ నాట గడిచిన నెల రోజులుగా అలుపెరగకుండా జరిగిన ప్రచారానికి నేటితో తెరపడింది ఇవి అసెంబ్లీ ఎన్నికలా( Assembly elections ) లేక లోక్సభ ఎన్నికలా అనే స్థాయిలో జాతీయ నేతల హడావిడి ఈసారి కన్నడ ఎన్నికల ప్రచారంలో కనిపించింది.సార్వత్రిక ఎన్నికలకు ఎక్కువ సమయం లేకపోవడం విజయం రెండు పార్టీలకు అత్యంత ప్రాధాన్యం ఉన్నది కావడంతో జాతీయ నాయకులంతా వరుస పెట్టి కన్నడ ప్రజలను ఆకట్టుకోవడానికి రికార్డ్ స్థాయిలో బహిరంగ సభలోను రోడ్ షోలలోను పాల్గొన్నారు.
దక్షిణాదిలో భారతీయ జనతా పార్టీ ( Bharatiya Janata Party )అధికారంలో ఉన్న ఏకైక రాష్ట్రం కావడంతో ఎట్టి పరిస్థితుల్లోనూ అధికారాన్ని వదులుకోకూడదు అన్న పట్టుదల భాజపా అధినాయకత్వంలో కనిపించింది .

సాక్షాత్తు ప్రధాని మోదీ( Prime Minister Modi ) 110 రోడ్ షోలు 27 బహిరంగ సభలో పాల్గొన్నారు అంటే భాజపా ఈ ఎన్నికలను ఎంత సీరియస్గా తీసుకుందో అర్థం చేసుకోవచ్చు .హోం మంత్రి అమిత్ షా కూడా అధిక సంఖ్యలో సభలకు హాజరై పార్టీ శ్రేణులకు దిశా నిర్దేశం చేశారు .దాదాపు బిజెపి పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు అందరూ కర్ణాటక ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు కేంద్ర మంత్రులు క్యూ కట్టారు ఎన్నికల ఫలితాలు ఎలా ఉన్నప్పటికీ భాజపా ఎన్నికల సంసిద్ధత మాత్రం నభూతో అన్న రీతిలో సాగిందని చెప్పవచ్చు.

మరొక పక్క కాంగ్రెస్ పార్టీ కూడా తన అస్త్రాలన్నీ సిద్ధం చేసుకుని మరి ఎన్నికలకు సిద్ధమయింది పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున్ కర్గే ( Mallikarjun Karge )తో పాటు ప్రియాంక గాంధీ రాహుల్ గాంధీ సోనియా గాంధీ తో సహా కాంగ్రెస్ ప్రముఖులందరూ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు .తమ పార్టీకి జవసత్వాలు కూడగట్టుకోవడానికి తన పార్టీ కి ఉన్న అద్భుత అవకాశం కర్ణాటక అని గ్రహించిన కాంగ్రెస్ పార్టీ ఎట్టి పరిస్థితుల్లో అధికారం సాధించాలని ప్రయత్నాలు చేసింది.కర్ణాటక కాంగ్రెస్ అనుకూలంగా ఉందన్న సర్వే ఫలితాలతో కాంగ్రెస్ రెట్టించిన ఉత్సాహంతో ప్రచారం చేసింది.మరోవైపు ప్రభుత్వ ఏర్పాటలో చక్రం తిప్పాలని భావిస్తున్న జెడిఎస్ కూడా తీవ్ర స్థాయిలో ప్రచారం చేసింది .ఇలా అన్నీ పార్టీల హడావిడితో కర్ణాటక ఎన్నికల వేడి పీక్ స్టేజ్ కి వెళ్ళినట్లుగా తెలుస్తుంది .మరి ఇప్పుడు బహిరంగ ప్రచారానికి తేరపడడంతో కర్ణాటకలో వాతావరణం కొంత ప్రశాంతం గా మారింది.







