తిరుమల తిరుపతి దేవస్థానంలో మరోసారి భద్రతాలోపం బయటపడింది.ఆదివారం రాత్రి శ్రీవారి ఆలయంలోకి వెళ్లిన ఓ భక్తుడు సెల్ ఫోన్ తో వెళ్లాడని తెలుస్తోంది.
ఈ క్రమంలోనే ఆనంద నిలయాన్ని భక్తుడు సెల్ ఫోన్ లో వీడియో తీశాడు.సమాచారం అందుకున్న టీటీడీ విజిలెన్స్ అధికారులు శ్రీవారి ఆలయంలో సీసీ కెమెరాలను పరిశీలిస్తున్నారు.
అయితే భద్రతా సిబ్బంది నిర్లక్ష్యంగా ఉండటం కారణంగానే ఇటువంటి చర్యలు జరుగుతున్నాయని భక్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.







