'వీరమల్లు' కోసం కూడా కాల్ షీట్స్ ఇస్తున్న పవన్.. ఈసారి సంక్రాంతికి పక్కా అట!

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) లైనప్ లో చాలా సినిమాలు ఉన్నాయి.పవన్ ఇటీవల ప్రకటించిన సినిమాలను ముందుగా పూర్తి చేస్తూ ఎప్పుడో రెండేళ్ల క్రితం ప్రకటించి ఇప్పటికే షూటింగ్ జరుపుకుని 70 శాతం కూడా పూర్తి చేసిన సినిమాను మాత్రం అంతగా పట్టించు కోవడం లేదు.

 Hari Hara Veera Mallu Movie Interesting Update, Hari Hara Veera Mallu, Pawan Kal-TeluguStop.com

ఇటీవలే ప్రకటించిన వినోదయం సీతం రీమేక్ లో తన పార్ట్ ను ఇప్పటికే పూర్తి చేసిన పవన్ ఇప్పుడు ”ఓజి” షూట్ లో బిజీగా ఉన్నాడు.

మధ్యలో హరీష్ శంకర్ దర్శకత్వంలో ప్రకటించిన ‘‘ఉస్తాద్ భగత్ సింగ్” షూట్ కూడా స్టార్ట్ చేసి ఒక షెడ్యూల్ పూర్తి చేసాడు.

మరి ఇటీవలే ప్రకటించిన ఈ రెండు సినిమాల షూటింగులను చేస్తున్న పవన్ కళ్యాణ్ వీటి కంటే ముందే ప్రకటించిన ”హరిహర వీరమల్లు” ( Hari Hara Veera Mallu ) సినిమాను మాత్రం పట్టించు కోవడం లేదు అని అంతా అనుకుంటున్నారు.

Telugu Harihara, Nidhhi Agerwal, Og, Pawan Kalyan, Ustaadbhagath-Movie

అయితే ఎట్టకేలకు పవన్ కళ్యాణ్ ఈ సినిమాకు కూడా కాల్ షీట్స్ కేటాయించినట్టు తెలుస్తుంది.పవన్ కళ్యాణ్ హీరోగా క్రిష్ ( Krish Jagarlamudi ) దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా గత రెండేళ్లుగా షూటింగ్ జరుపు కుంటూనే ఉంది.పవన్ కళ్యాణ్ మొదటిసారి పీరియాడికల్ డ్రామా చేస్తున్నాడు.

అది కూడా పాన్ ఇండియా సినిమా కావడం విశేషం.ఈ సినిమా ఇంకా 40 రోజుల షూటింగ్ బ్యాలెన్స్ ఉంది.

Telugu Harihara, Nidhhi Agerwal, Og, Pawan Kalyan, Ustaadbhagath-Movie

ఇక పవన్ కళ్యాణ్ జూన్ లో ఈ సినిమాకు కాల్ షీట్స్ ఇవ్వబోతున్నట్టు తెలుస్తుంది.అందుకే మేకర్స్ ఈ సినిమాను వచ్చే ఏడాది సంక్రాంతికి కానుకగా రిలీజ్ చేయడానికి పక్కా ప్లానింగ్ సిద్ధం చేసుకుంటున్నారు.ఇదిలా ఉండగా మొఘల్ కాలం నాటి ఫిక్షన్ కథతో తెరకెక్కుతున్న ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ కు జంటగా నిధి అగర్వాల్ ( Nidhhi Agerwal ) హీరోయిన్ గా నటిస్తుండగా.ఎం ఎం కీరవాణి సంగీతం అందిస్తున్నాడు.

జాక్వెలిన్ ఫెర్నాండేజ్ కీ రోల్ లో నటిస్తుంది.చూడాలి ఈ సినిమా ఎలాంటి హిట్ అందుకుంటుందో.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube