కెజిఎఫ్ సినిమా సెట్లోకి వెళ్లి అల్లరి నరేష్ డిష్యుమ్ డిష్యుమ్ అంటే ఎలా ఉంటుంది చెప్పండి.ఛత్రపతి సినిమాలో ఫైట్స్ వెన్నెల కిషోర్ చేస్తే… పోనీ బాలయ్య చెప్పాల్సిన డైలాగ్స్ జూనియర్ ఎన్టీఆర్ కానీ ప్రభాస్ కానీ చెప్తే ఎలా ఉంటుంది చెప్పండి.
మరి కాదంటే కమెడియన్ సునీల్ చెప్తే ఎలా ఉంటుంది.భలే తేడాగా ఉంటుంది కదా.మరి అదే పరిస్థితి అల్లరి నరేష్( Allari Naresh ) నరుక్కుంటూ వెళ్తుంటే అనిపించింది.మంచి మంచి కామెడీ వేషాలు వేసే హీరో కాస్త ఒకే సినిమాతో మాస్ హీరో అవ్వాలని అనుకుంటే ఆ ట్రాస్ఫార్మేషన్ జనాలు ఒప్పుకునే విధంగా ఉంటె ఒకే కానీ ఉగ్రం లాంటి సినిమాలతో అది జరిగే పని కాదు.

అల్లరి నరేష్ నిజమైన మాస్ హీరో అవ్వాలంటే ఖచ్చితంగా జనాలను కన్విన్స్ చేయగలిగే కంటెంట్ ఉండాలి.అది చాల డీప్ గా ఆడియన్ ని సీట్ లో కుర్చోపెట్ట గలగాలి.ఇప్పటికే నాంది.మారేడుమిల్లి ప్రజానీకం( Maredumilli Prajanikam ) అనే అర్ధం లేని సినిమాలు తీసి ఉగ్రం అనే లాజిక్ లేని సినిమాతో ప్రేక్షకులను అల్లరి నరేష్ ఒప్పించాలి అనుకున్న కూడా అది జరగడం లేదు.
ఉగ్రం అంటే జనాలను భయపెట్టేలా అవసరం ఉన్న లేకపోయినా నరుకుతూ వెళ్లడం కాదు.జనాలకు ఒక కనెక్టివిటీ పాయింట్ ఉండాలి.అల్లరి నరేష్ ఉగ్రం సినిమాలో చెప్పిన సీరియస్ డైలాగ్స్ కూడా పేలకపోగా ఒక్కోసారి నవ్వు పుట్టిస్తాయి.

కామెడీ స్టార్( Comedy Star ) ఒక సీరియస్ హీరో అవ్వకూడదు అని ఏమి లేదు కానీ ఒక్కసారిగా ఇంత మార్పు జరగడం జరిగే పని కాదు.ఈ మధ్య కాలంలో ఎలాంటి సినిమా వచ్చిన ప్రేక్షకులు అంత ఈజీ గా హిట్ అనే బహుమతి ఇవ్వడం లేదు.కథ, కథనం విషయంలో చాల త్వరగా జడ్జ్ చేస్తున్నారు.
అందుకే ఉగ్రం( Ugram ) స్క్రీన్ ప్లే అంత అద్భుతంగా ఏమి లేదంటున్నారు.ఇక పాత్రలో పరకాయ ప్రవేశం చేయడం నరేష్ కి ఏమి కొత్త కాదు.
కానీ ఈ సినిమా విషయంలో అది లోపించింది.కామెడీ ని అవపోసన పట్టిన అల్లరోడు సీరియస్ రోల్స్ కి చాల మెరుగు పడాల్సి ఉంది.
టైటిల్ కి న్యాయం చేయాలనీ క్లైమాక్స్ ని పొడిగించి జనాలకు చిరాకు తెప్పించాడు డైరెక్టర్.ఇక ఎన్ని గన్స్ సుత్తి తో వందల మంది ని చంపేయడం మన టాలీవుడ్ కి కొత్తేమి కాదు.
అలా అల్లరోడి ఉగ్రం జనాలకు పెద్దగా ఎక్కడం లేదు.







