ఆ స్టార్ హీరోయిన్ అందాన్ని చూసి ఆశ్చర్యపోయా.. రజనీకాంత్ కామెంట్స్ వైరల్!

సూపర్ స్టార్ రజనీకాంత్( Rajinikanth ) ప్రస్తుతం కెరీర్ పరంగా బిజీగా ఉన్న సంగతి తెలిసిందే.రజనీకాంత్ జైలర్ సినిమాలో( Jailer Movie ) నటిస్తుండగా నెల్సన్ దిలీప్ కుమార్ డైరెక్షన్ లో తెరకెక్కుతున్న ఈ సినిమాకు రికార్డ్ స్థాయిలో బిజినెస్ అఫర్లు వస్తుండటం గమనార్హం.

 Rajinikanth Shocking Comments About Meena Details, Meena , Rajinikanth, Super St-TeluguStop.com

అయితే హీరోయిన్ మీనా( Meena ) గురించి రజనీకాంత్ ఆసక్తికర వ్యాఖ్యలు చేయగా ఆ విషయాలు వైరల్ అవుతున్నాయి.రజనీకాంత్ , మీనా కాంబినేషన్ లో పలు సినిమాలు తెరకెక్కాయనే సంగతి తెలిసిందే.

నాకు ఇష్టమైన హీరోయిన్లలో మీనా ఒకరని ఒక సినిమాలో మీనా నా కూతురిగా కనిపించిందని ఆ సమయంలో మీనా వయస్సు ఏడు సంవత్సరాలు అని ఆయన తెలిపారు.ఆ తర్వాత ఒక సినిమాలో మీనాకు మేనమామగా నేను నటించానని రజనీకాంత్ కామెంట్లు చేశారు.

యాజమన్ అనే సినిమాలో నటిస్తున్న సమయంలో ఆ సినిమాలో హీరోయిన్ మీనా అని తెలిసి ఆశ్చర్యపోయానని రజనీకాంత్ చెప్పుకొచ్చారు.

నేను చూసిన చిన్నపిల్ల ఇప్పుడు చాలా అందంగా ఉన్నారని అనిపించిందని ఆమెను చూసి ఆశ్చర్యపోయానని ఆయన కామెంట్లు చేశారు.మీనాకు నిజాయితీ ఎక్కువని ఆమె చాలా టాలెంటెడ్ అని రజనీ తెలిపారు.మీనా ఉన్నతమైన ఆలోచనల వల్లే ఆమె ఈ స్థాయికి చేరుకున్నారని రజనీ చెప్పుకొచ్చారు.

తన ఇంట్లో ఏ ప్రోగ్రామ్ జరిగినా మీనా కచ్చితంగా వచ్చి పాల్గొనాలని రజనీకాంత్ అభిప్రాయం వ్యక్తం చేశారు.

రజనీకాంత్ జైలర్ మూవీతో సక్సెస్ ట్రాక్ లోకి రావాలని ఫ్యాన్స్ భావిస్తున్నారు.రజనీకాంత్ రెమ్యునరేషన్ 50 కోట్ల రూపాయల రేంజ్ లో ఉందని సమాచారం అందుతోంది.రజనీకాంత్ గత సినిమాలు ప్రేక్షకులను తీవ్రస్థాయిలో నిరాశపరిచాయనే సంగతి తెలిసిందే.

తెలుగులో రజనీకాంత్ మార్కెట్ అంతకంతకూ తగ్గుతోంది.త్వరలో సూపర్ స్టార్ రజనీకాంత్ కొత్త ప్రాజెక్ట్ లను సైతం ప్రకటిస్తారని తెలుస్తోంది.

రజనీకి మరిన్ని విజయాలు దక్కాలని అభిమానులు కోరుకుంటున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube