నాగచైతన్య వ్యాఖ్యలపై స్పందించిన సామ్... అవే మనల్ని దూరం చేశాయి అంటూ పోస్ట్!

తెలుగు సినిమా ఇండస్ట్రీలో క్యూట్ కపుల్ గా ఉన్నటువంటి వారిలో సమంత ( Samantha ) నాగచైతన్య( Nagachaitanya ) జంట ఒకటని చెప్పాలి.అయితే సమంత నాగచైతన్యను పెళ్లి చేసుకుని మూడు సంవత్సరాలు పాటు సంతోషంగా ఉండి అనంతరం తమ బంధం నుంచి విడిపోయారు.

 Sam Reacts To Naga Chaitanyas Comments Post That They Have Distanced Us , Custod-TeluguStop.com

ఇలా సమంత నాగచైతన్య విడాకులు ( Divorce ) తీసుకుని విడిపోవడంతో వీరి విడాకులకు గల కారణాలు ఏంటి అని ప్రతి ఒక్కరు ఆరా తీశారు.అయితే తాజాగా కస్టడీ సినిమా( Custody Movie) ప్రమోషన్ కార్యక్రమాలలో భాగంగా కేవలం సోషల్ మీడియాలో వచ్చిన రూమర్స్ కారణంగానే మేమిద్దరం విడాకులు తీసుకున్నామంటూ నాగచైతన్య చెప్పారు.

సమంత చాలా మంచి అమ్మాయి ఇప్పటికీ తన జ్ఞాపకాలను గౌరవిస్తాను.సోషల్ మీడియాలో వచ్చిన రూమర్స్ కారణంగానే మా ఇద్దరి మధ్య గొడవలు వచ్చాయని అందుకే విడిపోయామని విడాకుల గురించి క్లారిటీ ఇచ్చారు.నాగచైతన్య విడాకులకు గల కారణాలను తెలియజేయడంతో ఒక్కసారిగా ఈ న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.ఇలా నాగచైతన్య చేసిన ఈ పోస్ట్ వైరల్ కావడంతో తాజాగా సమంత తన ఇంస్టాగ్రామ్ స్టోరీ ద్వారా మరొక ఆసక్తికరమైన పోస్ట్ చేశారు.

ఈ క్రమంలోనే సమంత ఒక కొటేషన్ షేర్ చేయగా ఇందులో మనమంతా ఒక్కటే కేవలం అహంకారం, భయం అవే మనల్ని దూరం చేస్తాయి అంటూ సమంత ఇంస్టాగ్రామ్ స్టోరీస్ ద్వారా షేర్ చేశారు.అయితే ఈ స్టోరీ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారడంతో చైతన్య వ్యాఖ్యలపై సమంత ఇలా స్పందిస్తూ కామెంట్స్ చేశారని భావిస్తున్నారు.అలాగే వీరి మధ్య ప్రేమ ఉన్నప్పటికీ కేవలం ఈగో కారణంగానే విడిపోయారని వీరిద్దరు చేసిన వ్యాఖ్యలు బట్టి చూస్తే అర్థమవుతుంది.ప్రస్తుతం సమంత షేర్ చేసిన పోస్ట్ వైరల్ అవుతుంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube