తెలుగు సినిమా ఇండస్ట్రీలో నటుడిగా ఎంతో పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్న ఎన్టీఆర్( NTR ) కేవలం మన దక్షిణాది ఇండస్ట్రీలోనే కాకుండా నార్త్ ఇండస్ట్రీలో కూడా అదే స్థాయిలో ఆదరణ సంపాదించుకున్నారు.ఇక రాజమౌళి ( Rajamouli ) దర్శకత్వంలో వచ్చిన RRR సినిమా ద్వారా గ్లోబల్ స్టార్ గా గుర్తింపు పొందారు.
ఇలా ఈ సినిమాతో అంతర్జాతీయ స్థాయిలో ఎంతో ఫ్యాన్ ఫాలోయింగ్ సొంతం చేసుకున్న ఎన్టీఆర్ ప్రస్తుతం వరుస సినిమాలలో నటిస్తూ బిజీగా ఉన్నారు.అయితే ఎన్టీఆర్ కేవలం వెండితెరపై మాత్రమే కాకుండా బుల్లితెరపై కూడా నటించి సందడి చేసిన విషయం మనకు తెలిసిందే.

ఎన్టీఆర్ వ్యాఖ్యాతగా బిగ్ బాస్ ( Bigg Boss ) మొదటి సీజన్ ప్రసారమైన విషయం మనకు తెలిసిందే.ఈ కార్యక్రమానికి యాంకర్ గా వ్యవహరించిన ఎన్టీఆర్ ఈ కార్యక్రమాన్ని ఎంతో విజయవంతం చేశారు.ఇక ఈ షో ఇంత సక్సెస్ అయ్యింది అంటే అందుకు కారణం ఎన్టీఆర్ అని చెప్పాలి.ఇక ఈ కార్యక్రమం తర్వాత ఈయన తిరిగే సినిమా పనులలో బిజీ అయ్యారు.
అయితే జెమినీ టీవీలో మరోసారి ఎవరు మీలో కోటీశ్వరుడు ( Yevaru Meelo Koteswarudu )అనే కార్యక్రమానికి వ్యాఖ్యాతగా వ్యవహరిస్తూ బుల్లితెర ప్రేక్షకులను సందడి చేశారు.

ఇక ఎన్టీఆర్ ప్రస్తుతం కొరటాల శివ (Karatala Shiva) సినిమా షూటింగ్ పనులలో బిజీగా ఉన్నారు.ఈ సినిమా తర్వాత ఈయన ప్రశాంత్ నీల్( Prashanth Neel ) దర్శకత్వంలో మరో సినిమా చేయనున్నారు.దీనితోపాటు హిందీ వార్ 2( War 2) సినిమాలో కూడా నటించబోతున్నారు.
ఇలా వరుస సినిమా షూటింగులతో ఎంతో బిజీగా ఉండే తారక్ తిరిగి మరోసారి బుల్లితెర ప్రేక్షకులను సందడి చేయడానికి సిద్ధమయ్యారట.

ఇప్పటికే ఈ విషయానికి సంబంధించి తారక గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని త్వరలోనే ఈ రియాలిటీ షో కి సంబంధించిన విషయాలన్నీ ప్రకటించబోతున్నారని తెలుస్తోంది.అయితే ఈయన గతంలో బిగ్ బాస్ కార్యక్రమానికి హోస్ట్ గా వ్యవహరించారు.కనుక ఇప్పుడు కూడా బిగ్ బాస్ సీజన్ సెవెన్ కార్యక్రమానికి హోస్ట్ గా వ్యవహరించబోతున్నారంటూ పలువురు సందేహాలను వ్యక్తం చేస్తున్నారు.
మరి ఇందులో ఎంతవరకు నిజం ఉందో తెలియాల్సి ఉంది.







