నందమూరి వారసుడిగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి పలు సినిమాలలో నటించిన నందమూరి తారకరత్నకు (Tarakaratna) ఇండస్ట్రీలో పెద్దగా కలిసి రాలదని చెప్పాలి.ఈ విధంగా ఇండస్ట్రీలో సక్సెస్ సాధించలేని తారకరత్న రాజకీయాలలోకి రావాలని భావించారు.
ఈ క్రమంలోనే వచ్చే ఎన్నికలలో తెలుగుదేశం పార్టీ తరఫున పోటీ చేయడానికి ఈయన సిద్ధమయ్యారు.అందుకు అనుగుణంగానే పార్టీ ప్రచార కార్యక్రమాలలో కూడా పాల్గొన్నారు.
నారా లోకేష్ (Lokesh) ప్రారంభించిన యువగళం(Yuvagalam) పాదయాత్రలో పాల్గొన్నటువంటి తారకరత్న మొదటి రోజు గుండెపోటుకు గురైన సంగతి తెలిసిందే.ఇలా గుండెపోటుకు పోటుకు గురైన ఇతనిని బెంగుళూరు నారాయణ హృదయాలయ ఆసుపత్రికి తరలించారు.
బెంగళూరులోని నారాయణ హృదయాలయాలో సుమారు 23 రోజుల పాటు మృత్యువుతో పోరాడిన తారకరత్న మరణించిన విషయం మనకు తెలిసిందే.అయితే ఈయన జనవరి 27వ తేదీ గుండెపోటుకు గురికాగా ఫిబ్రవరి 18వ తేదీ మరణించారు.
అయితే ఈయన మరణించిన ఆ క్షణం తారకరత్న మరణం గురించి వైసిపి నాయకులు, లక్ష్మీపార్వతి సంచలన వ్యాఖ్యలు చేశారు.తారకరత్న గుండెపోటు వచ్చిన రోజే మరణించారని అయితే ఆయన మరణం వార్తను బయట పెడితే లోకేష్ పాదయాత్రకు నెగిటివ్ ప్రభావం ఏర్పడుతుందని భావించి ఈ విషయాన్ని దాచారని తెలిపారు.

ఇక తాజాగా మరోసారి తారకరత్న మరణ వార్త సోషల్ మీడియాలో చర్చలకు కారణమైంది.తారకరత్న మరణం పై తమకు అనుమానాలు ఉన్నాయని ఈయన ఎప్పుడు మరణించారనే విషయం గురించి సిబీఐ ఎంక్వయిరీ చేయాల్సిందే అంటూ కేఏ పాల్( KA Paul ) డిమాండ్ చేశారు.తాజాగా ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ తారకరత్న మృతి పై తమకు అనుమానాలు ఉన్నాయి.

అయితే ఆయన చనిపోయిన రోజు ఇలా రాజకీయాలు చేయడం మంచిది కాదని భావించి తాను అక్కడికి వెళ్లి బాధతో ప్రార్థన చేసి వచ్చానని తెలిపారు.అయితే ఈయన మొదటి రోజే మరణించారని కావాలనే దాచిపెట్టారంటూ తమకు సందేహాలు ఉన్నాయని ఈ విషయం గురించి సిబిఐ ఎంక్వయిరీ వేసి ఆయన ఎప్పుడు చనిపోయారనే విషయాన్ని బయట పెట్టాలి అంటూ ఈయన డిమాండ్ చేయడంతో మరోసారి తారకరత్న మరణం సోషల్ మీడియాలో చర్చలకు కారణమైంది.







