వైసీపీ ప్రభుత్వంపై టీడీపీ అధినేత చంద్రబాబు మండిపడ్డారు.అంబేద్కర్ కోనసీమ జిల్లాలోని రామచంద్రపురంలో పర్యటించిన ఆయన సర్కార్ పై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు.
ఇటీవల కురిసిన అకాల వర్షాలతో రైతులు తీవ్రంగా నష్టపోయారని తెలిపారు.ప్రభుత్వం చేతగాని తనంతో రైతులు ఇబ్బంది పడుతున్నారని ఆరోపించారు.
రైతుల బలవన్మరణంలో ఏపీ రెండో స్థానంలో ఉందని చెప్పారు.రైతంగాన్ని మిల్లర్ల చేతిలో పెట్టారని మండిపడ్డారు.
ఈ క్రమంలో రైతులపై కేసులు పెడితే తాటతీస్తామని హెచ్చరించారు.







