వెంకట్ ప్రభు డైరెక్షన్ లో నాగ చైతన్య( Naga Chaitanya ) హీరోగా తెరకెక్కిన సినిమా కస్టడి.( Custody Movie ) తెలుగు తమిళ బైలింగ్వల్ మూవీగా వస్తున్న ఈ సినిమా వచ్చే వారం ప్రేక్షకుల ముందుకు వస్తుంది.
ఈ సినిమాలో నాగ చైతన్య సరసన కృతి శెట్టి( Krithi Shetty ) హీరోయిన్ గా నటించింది.ఆల్రెడీ బంగార్రాజు సినిమాతో హిట్ కాంబినేషన్ గా క్రేజ్ తెచ్చుకున్న ఈ ఇద్దరు మరోసారి ఆ మ్యాజిక్ రిపీట్ చేయాలని చూస్తున్నారు.

కృతి శెట్టి కి కూడా ఈ సినిమా రిజల్ట్ చాలా ఇంపార్టెంట్ అని చెప్పొచ్చు.ఈ సినిమాకు వెంకట్ ప్రభు శివ( Shiva ) టైటిల్ ని రిఫర్ చేశాడట.కానీ నాగ చైతన్య ఆ టైటిల్ వద్దని అన్నారట.కాప్ సినిమాకు నాగార్జున పవర్ ఫుల్ టైటిల్ శివ కన్నా మరోటి ఆలోచన రాదు.

కానీ తండ్రి ఐకానిక్ సూపర్ హిట్ టైటిల్ వద్దనుకున్నాడు నాగ చైతన్య. అయితే కస్టడీ టైటిల్ ఈ సినిమాకు పర్ఫెక్ట్ అని.సినిమా తప్పకుండా ప్రేక్షకులను అలరిస్తుందని అంటున్నాడు.వెంకట్ ప్రభు ఇదివరకు చేసిన సినిమాలు చాలా మంచి ఫలితాలు అందుకున్నాయి.
నాగ చైతన్యతో ఈ సినిమా తప్పకుండా అదే రేంజ్ ఫలితాన్ని అందుకుంటుందని చెప్పొచ్చు.







