ఏపీలో మరో ఏడాదికి అసెంబ్లీ ఎన్నికలు( Assembly elections ) రాబోతున్నాయి.గత అసెంబ్లీ ఎన్నికల్లో వైకాపా భారీ విజయాన్ని సొంతం చేసుకుంది.
జనసేన పార్టీ ఒక్క సీటు తో సరిపెట్టుకోవాల్సి వచ్చింది.తెలుగు దేశం పార్టీ నాయకులు అత్యంత దారుణమైన పరాజయంను మూట కట్టుకోవాల్సి వచ్చింది.
పార్టీ ముఖ్య నేత అయిన లోకేష్ కూడా ఆ ఎన్నికల్లో ఓటమి చవిచూశాడు.జనసేన , తెలుగు దేశం పార్టీ మరియు బీజేపీ( BJP ) కలిసి పోటీ చేసిన సమయంలో విజయాన్ని సొంతం చేసుకుని అధికారాన్ని దక్కించుకున్న విషయం తెల్సిందే.2019 ఎన్నికల్లో నాలుగు పార్టీ లు వేరు వేరుగా పోటీ చేశాయి.దాంతో జనసేన పార్టీకి నిరాశ మిగిలింది.
అలాగే తెలుగు దేశం పార్టీ( Telugu Desam Party ) అధికారానికి దూరం అయ్యింది.అందుకే 2024 అసెంబ్లీ ఎన్నికల్లో కచ్చితంగా తెలుగు దేశం పార్టీ తో కలిసి పోటీ చేయాలని జనసేన పార్టీ నాయకులు మరియు కార్యకర్తలు తీవ్రంగా ప్రయత్నాలు చేస్తున్నారు.
ప్రస్తుతం బీజేపీ తో జనసేన పార్టీ పొత్తులో ఉన్న విషయం తెల్సిందే.
ఆ పొత్తు ఎంత వరకు కొనసాగుతుందో తెలియడం లేదు.అంతే కాకుండా ఆ పొత్తు వల్ల పెద్దగా ప్రయోజనం ఉన్నట్లుగా కూడా కనిపించడం లేదు.అందుకే బీజేపీ తో పొత్తు కంటే కూడా తెలుగు దేశం పార్టీ తో పొత్తు వల్ల ఎక్కువ ప్రయోజనం ఉంటుందనే అభిప్రాయం ను జనసేన ( Janasena )నాయకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.
బీజేపీ తో వెళ్తే పవన్ కళ్యాణ్ సీఎం క్యాండిడేట్.కానీ తెలుగు దేశం పార్టీ తో వెళ్తే మాత్రం పవన్ సీఎం పీఠం పై నమ్మకం వదులుకోవాలి.
ఈసారి కి సీఎం పీఠం లేకున్నా పర్వాలేదు కానీ టీడీపీ తో పొత్తు పెట్టుకోవాలని జనసైనికులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.పవన్ మాట ఏంటి అనేది చూడాలి.