ఆ రెండు విషయాలు వైకాపాని తెగ భయపెడుతూ ఉన్నాయట

ఏపీలో వచ్చే అసెంబ్లీ ఎన్నికల( Assembly elections ) నాటికి రాజకీయాలు అనూహ్య మలుపులు తీసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి.గత ఎన్నికల్లో దాదాపుగా క్లీన్‌ స్వీప్ అన్నట్లుగా సీట్లను గెలిచిన వైకాపా వచ్చే ఎన్నికల్లో ఎంత వరకు గెలుస్తుంది అంటే కొందరు మీడియా సర్కిల్స్ వారు మరియు రాజకీయ విశ్లేషకులు మాత్రం చాలా ఇబ్బందులు ఎదుర్కోవాల్సి రావచ్చ అన్నట్లుగా కామెంట్స్ చేస్తున్నారు.

 Andhra Pradesh Next Assembly Elections Ysrcp Problems , Assembly Elections, Ysr-TeluguStop.com

కొన్ని మీడియా సంస్థలు మాత్రం వైకాపా మళ్లీ సొంతంగా పోటీ చేసి విజయాన్ని సొంతం చేసుకోవడం ఖాయం.జగన్ ( jagan )సీఎం అవ్వడం ఖాయం అన్నట్లుగా కామెంట్స్ చేయడం జరుగుతుంది.

ఇక రాజకీయ విశ్లేషకులు చెబుతున్న దాని ప్రకారం వచ్చే ఎన్నికల్లో వైకాపాకు రెండు విషయాలు ప్రతికూలంగా మారే అవకాశం ఉంది.మొదటిది రాజధాని లేకపోవడం.

అమరావతి నుండి వైజాగ్‌ కు రాజధాని ని తరలిస్తున్నట్లుగా ప్రకటన వచ్చింది.కానీ ఇప్పటి వరకు అలాంటిది ఏమీ జరగేలేదు.

దాంతో విజయవాడ ప్రాంతంలో ఉన్న అసెంబ్లీ స్థానాల్లో వైకాపాకు చేదు అనుభవం తప్పదు అంటున్నారు.

ఉత్తరాంద్ర మొత్తం కూడా వైకాపా( ycp ) కు రాజధాని కారనంగా వ్యతిరేకం అయినా ఆశ్చర్యం లేదు.ఇక వైఎస్ వివేకా హత్య కేసు విషయం లో కూడా అధికార పార్టీకి కష్టాలు తప్పవేమో అంటూ కామెంట్స్ వస్తున్నాయి.రాష్ట్ర వ్యాప్తంగా కూడా తెలుగు దేశం పార్టీ వివేకా హత్య కేసు గురించి.

అవినాష్ రెడ్డిని అరెస్ట్‌ చేయడం గురించి.వైకాపా నేత భాస్కర్ రెడ్డిని( Bhaskar Reddy ) అరెస్ట్‌ చేయడం వల్ల బాబాయిని చంపించింది అబ్బాయే అంటూ టీడీపీ వారు కామెంట్స్ చేస్తున్నారు.

ఈ నేపథ్యంలో కచ్చితంగా ఏపీ రాజకీయాల్లో వివేక కేసు ప్రభావం చూపించే అవకాశాలు ఉన్నాయి.గత అసెంబ్లీ ఎన్నికల సమయంలో వివేకా హత్య ప్రభావం చూపించింది.

కనుక వచ్చే ఎన్నికల్లో కూడా ఏదో ప్రభావం చూపడం ఖాయం అన్నట్లుగా రాజకీయ విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube