తాజాగా సీనియర్ ఎన్టీఆర్( Senior NTR ) శత జయంతి వేడుకలు ఘనంగా జరిగిన విషయం తెలిసిందే.ఈ కార్యక్రమానికి పలువురు రాజకీయ నాయకులు సినీ ప్రముఖులు హాజరయ్యారు.
ఈ కార్యక్రమానికి సీనియర్ స్టార్ హీరో రజనీకాంత్ ( Rajinikanth )కూడా హాజరయ్యారు.ఈ సందర్భంగా రజనీకాంత్ మాట్లాడుతూ చంద్రబాబుపై పొగడ్తల వర్షం కురిపించారు.
హాజరయ్యింది సీనియర్ ఎన్టీఆర్ వేడుకలకు అయితే బాబుని పొగడటమే ద్యేయంగా పెట్టుకొని హాజరయ్యారు అన్నట్టుగా రజినీకాంత్ ప్రశంశలు కురిపించారు.

కాగా రజనీకాంత్ చేసిన వ్యాఖ్యలపై వైసీపీ నేతలు( YCP leaders ) స్పందిస్తూ రజినీకాంత్ భాయి నెగిటివ్గా కామెంట్స్ చేయడంతో పాటు ఇష్టం వచ్చిన విధంగా తిడుతున్నారు.అంతేకాకుండా మరింత రెచ్చిపోయి రజినీకాంత్ ఆరోగ్యం పై, కుటుంబంపై నిందలు వేస్తున్నారు.అయితే సోషల్ మీడియాలో దారుణంగా కామెంట్స్ చేస్తుండగా రజనీకాంత్ ఆప్త మిత్రుడు వైసీపీ గెలుపు కోసం పనిచేసిన మోహన్ బాబు( Mohan Babu ) మాత్రం స్పందించకుండా మౌనంగా ఉండడం అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది.
రజినీకాంత్ వైసిపి పై విమర్శలు చేసి జగన్ పాలనను ఖండించి ఉంటే ఆ పార్టీ నేతలు విమర్శలు చేసి నెగిటివ్గా కామెంట్స్ చేసిన ఒక అర్థం ఉండేది.

కానీ అసలు వైసిపి గురించి ప్రస్తావించలేదు.కానీ వైసీపీ నేతలు మాత్రం బరితెగించి మానసిక దాడి చేస్తున్నారు.రజినీకాంత్ కుటుంబాన్ని అతని వ్యక్తిత్వాన్ని కించపరిచే విధంగా కామెంట్స్ చేస్తున్నారు.
అలా కామెంట్ చేయడం తప్పు అలా మాట్లాడకూడదు అంటూ చెప్పాల్సిన మోహన్ బాబు మౌనంగా ఉండడంతో అది అనేక అనుమానాలకు దారి తీస్తోంది.మోహన్ బాబు రజనీకాంత్ ని ఎంతో ఆప్తమిత్రులుగా చెప్పుకుంటూ ఉంటారు.
మరి అలాంటిది ఆయనపై వైసీపీ నేతలు ఆ విధంగా విరుచుకుపడుతున్న కూడా ఎందుకు ఖండించడం లేదు అన్న ప్రశ్న ప్రస్తుతం ఎదురవుతోంది.







