అక్కినేని నట వారసుడిగా సిని రంగంలోకి అడుగు పెట్టాడు అఖిల్( Akhil Akkineni ) .గత కొంతకాలంగా మంచి హిట్ కోసం అఖిల్ ఎదురు చూస్తున్నాడు .
ఈ క్రమంలోనే సురేందర్ రెడ్డి దర్శకత్వంలో స్పై యాక్షన్ మూవీ ఏజెంట్ లో నటించాడు .ఈ సినిమాలో సాక్షి వైద్య హీరోయిన్‌గా నటించింది.భారీ బడ్జెట్‌తో గ్రాండ్‌గా రిలీజైన ఈ చిత్రం ఆశించినంత విజయాన్ని అందుకోలేకపోయింది.ఫలితంగా రిలీజైన తొలిరోజే నెగిటివ్ టాక్‌ను సొంతం చేసుకుంది.అఖిల్ కెరీర్‌లో ఇంకో డిజాస్టర్‌గా ఏజెంట్ మిగిలిపోయింది.ఇక సినిమా ఫెయిల్యూర్‌పై స్వయంగా నిర్మాత అనిల్ సుంకర కూడా బౌండ్ స్క్రిప్ట్ లేకుండా షూటింగ్ కి వెళ్లాం, తప్పు జరిగింది అంటూ ఓపెన్ కామెంట్స్ చేశారు…

ఇక ఈ విషయం పక్కన పెడితే అఖిల్ కెరియర్ మీద నాగార్జున( Nagarjuna ) చాలా డిస్టబెన్స్ గా ఉన్నట్టు తెలుస్తుంది…వరుస సినిమాలు ప్లాప్ అవ్వడం అసలు అఖిల్ హీరోగా సక్సెస్ అవుతాడా లేదా అనే టెన్షన్ లో నాగార్జున ఉన్నట్టుగా తెలుస్తుంది ఇక ఇది ఇలా ఉంటే అఖిల్ సిని కెరియర్ ఎలా ఉన్న పర్లేదు కానీ పర్సనల్ లైఫ్ లో మాత్రం అఖిల్ కెరియర్ ని నాగార్జున సెట్ చేసే పనిలో ఉన్నట్టు తెలుస్తుంది…

అందుకే నాగార్జున అఖిల్ కి పెళ్లి చేయాలని చూస్తున్నట్టుగా తెలుస్తుంది…ఎందుకంటే ఇప్పటికే పెళ్లి చేసిన నాగ చైతన్య( Naga Chaitanya ) లైఫ్ అలా అయిపోయింది ఇక అఖిల్ ని చూసుకుంటే సినిమా కెరియర్ మరి దారుణం గా ఉండటం తో లేట్ చేయకుండా అఖిల్ కి పెళ్ళి చేద్దాం అని చూస్తున్నట్టుగా తెలుస్తుంది…
.







