రష్మిక మందన్న(Rashmika Mandanna) పరిచయం అవసరం లేని పేరు కన్నడ చిత్ర పరిశ్రమ నుంచి ఇండస్ట్రీకి వచ్చి అతి తక్కువ సమయంలోనే స్టార్ హీరోయిన్ గా కొనసాగుతున్న రష్మిక ప్రస్తుతం వరుస సినిమాలలో నటిస్తూ బిజీగా ఉన్నారు.ఇలా భాషతో సంబంధం లేకుండా తెలుగు, కన్నడ, హిందీ, తమిళ భాషలలో సినిమాలు చేస్తూ బిజీగా గడుపుతున్నారు.
సినిమాల పరంగా ఎంతో బిజీగా ఉండే రష్మిక సోషల్ మీడియాలో కూడా చాలా యాక్టివ్ గా ఉంటారు.సోషల్ మీడియా వేదికగా తనకు సంబంధించిన అన్ని విషయాలను అభిమానులతో పంచుకుంటారు.
అయితే కొన్నిసార్లు రష్మిక చేస్తే పోస్టుల కారణంగా ట్రోల్స్ కూడా ఎదుర్కోవాల్సి వస్తుంది.

ఇలా అన్ని విషయాలను అభిమానులతో పంచుకొని ఈమెకు పాన్ ఇండియా స్థాయిలో ఎంతో మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది.సోషల్ మీడియాలో కూడా విపరీతమైన ఫాలోవర్స్ ఉన్నారు.తాజాగా ఈమె ఇంస్టాగ్రామ్(Instagram) లో సరికొత్త రికార్డులను సృష్టించారు.
ఇంస్టాగ్రామ్ లో రష్మిక ఏకంగా 38 మిలియన్ ఫాలోవర్స్(38 Million Fallowers) సంపాదించుకున్నారు.అయితే టాలీవుడ్ ఇండస్ట్రీలో అత్యధిక ఫాలోవర్స్ కలిగినటువంటి టాప్ హీరోయిన్ గా ఈమె రికార్డ్ సృష్టించడం విశేషం.

రష్మిక కన్నా ముందుగా ఇండస్ట్రీలోకి వచ్చి ఇందులో కూడా వరుస సినిమాలలో నటిస్తున్నటువంటి సమంత ఇంస్టాగ్రామ్ లో 26.4 మిలియన్ ఫాలోవర్స్ ఉండగా, కాజల్ అగర్వాల్ 25.4 ( Kajal Aggarwal ),తమన్నా 20.7 మిలియన్ ఫాలోవర్స్ ఉన్నారు.అయితే ఈ హీరోయిన్స్ అందరూ ఇండస్ట్రీలో కొనసాగుతూ దాదాపు దశబ్దన్నర కాలం అవుతుంది.కానీ రష్మిక ఇండస్ట్రీలోకి వచ్చిన ఆరు సంవత్సరాలకి ఈ రేంజ్ లో ఫ్యాన్ ఫాలోయింగ్ సొంతం చేసుకోవడం విశేషం.
ఇక ప్రస్తుతం ఈమె పుష్ప2, రెయిన్ బో, యానిమల్ వంటి సినిమాలలో నటిస్తూ బిజీగా ఉన్నారు.







