వామ్మో త్రిష... ఈ వయసులో కూడా రేటు విషయంలో కుమ్మేస్తోంది

త్రిష సినీ రంగ ప్రవేశం చేసి దాదాపుగా 2 దశాబ్దాలు అవుతుంది.సాధారణంగా హీరోయిన్స్ దశాబ్ద కాలం పాటు తమ కెరియర్ ని కొనసాగిస్తే గొప్ప విషయం.

 Trisha Latest Remuneration For Upcoming Films ,remuneration , Trisha , Mani Rat-TeluguStop.com

ఈ మధ్య కాలంలో కొందరు హీరోయిన్స్ ఇలా వచ్చి అలా వెళ్ళి పోతున్నారు.అతి కొద్ది మంది హీరోయిన్స్ మాత్రమే ఎక్కువ కాలం కొనసాగుతున్నారు.

రెండు దశాబ్దాల పాటు హీరోయిన్ గా కొనసాగడం అంటే అది కేవలం బాలీవుడ్లో కొద్ది మందికే సాధ్యమవుతుంది.సౌత్ లో రెండు దశాబ్దాలుగా కెరియర్ కొనసాగిస్తూ సక్సెస్‌ ఫుల్‌ సినిమా లతో దూసుకు పోతున్న హీరోయిన్స్ ఇద్దరు ముగ్గురు మాత్రమే ఉన్నారు.

Telugu Kollywood, Mani Ratnam, Ponniyin Selvan, Tollywood, Trisha-Movie

అందులో త్రిష( Trisha ) ఒకరు అనడంలో సందేహం లేదు.ఇతర హీరోయిన్స్ రెండు దశాబ్దాలు పూర్తయిన తర్వాత రెమ్యూనరేషన్ విషయం లో డిమాండ్ లేకుండా ఎంత ఇస్తే అంత అన్నట్లుగా వచ్చిన అవకాశాలను చేసుకుంటూ వెళ్తున్నారు.కానీ త్రిష మాత్రం కథ నచ్చాలి అలాగే పారితోషికం కూడా చాలా ఎక్కువగా ఇవ్వాలి అంటూ డిమాండ్ చేస్తుందంట.

Telugu Kollywood, Mani Ratnam, Ponniyin Selvan, Tollywood, Trisha-Movie

తాజాగా మణిరత్నం( Mani Ratnam ) దర్శకత్వంలో వచ్చిన పొనియిన్ సెల్వం( Ponniyin Selvan 2 ) చిత్రం సూపర్ హిట్ టాక్ ని తమిళంలో దక్కించుకుంది.దాంతో త్రిష రెమ్యూనరేషన్ భారీగా పెంచేందుకు సిద్ధం అయినట్లుగా తెలుస్తోంది.కోటి రూపాయల పారితోషకం తీసుకుంటూ నటిస్తున్న త్రిష ఏకంగా కోటిన్నర నుండి రెండు కోట్ల రూపాయల పారితోషికాన్ని డిమాండ్ చేస్తున్నట్లుగా తెలుస్తోంది.

ఇక లేడి ఓరియెంటెడ్ సినిమాలకు ఏకంగా రెండున్నర కోట్ల రూపాయలను ఆమె డిమాండ్ చేస్తుందని తమిళ మీడియా వర్గాల ద్వారా సమాచారం అందుతుంది.

Telugu Kollywood, Mani Ratnam, Ponniyin Selvan, Tollywood, Trisha-Movie

ఈ స్థాయి రెమ్యూనరేషన్ ని కొత్త హీరోయిన్స్ కి ఇస్తూ ఉంటారు.కానీ రెండు దశాబ్దాల కెరియర్ తర్వాత నాలుగు పదుల వయసులో ఇంత రెమ్యూనరేషన్ తీసుకోవడం కేవలం త్రిషకు మాత్రమే చెల్లింది అంటూ ఆమె అభిమానులతో పాటు తమిళ మీడియా వర్గాల వారు మాట్లాడుకుంటున్నారు.త్రిష ఈ మధ్య కాలంలో తెలుగు సినిమాలకు చాలా తక్కువగా ఒకే చెప్తోంది.

తాజా సినిమా సక్సెస్ అవడంతో త్రిషకి తెలుగు నుండి కూడా అవకాశాలు వస్తాయేమో చూడాలి.అయితే తెలుగు లో త్రిష డిమాండ్ కి తగ్గట్లుగా రెమ్యూనరేషన్ దక్కుతుందా లేదా అనేది మాత్రం తెలియాల్సి ఉంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube