తమిళ నటుడు అయినా విజయ్ ఆంటోనీ( Vijay Antony ) నటించిన బిచ్చగాడు సినిమా తెలుగు లో భారీ విజయాన్ని సొంతం చేసుకున్న విషయం తెలిసిందే.ఆ సినిమా వచ్చి చాలా సంవత్సరాలు అవుతున్నా కూడా విజయ్ ఆంటోనీ ని బిచ్చగాడు హీరో గానే తెలుగు ప్రేక్షకులు గుర్తిస్తున్నారు.
ఆ తర్వాత ఆయన నటించిన సినిమాలు చాలానే వచ్చాయి.కొన్ని తమిళంలో పర్వాలేదు అనిపించుకున్న కానీ తెలుగు లో మాత్రం ఏ ఒక్కటి ఆకట్టుకోలేక పోయింది.
మినిమం కలెక్షన్స్ ని కూడా రాబట్టుకోలేక పోయింది.దాంతో మళ్లీ తెలుగులో రాణించాలంటే.
తెలుగు లో సక్సెస్ అవ్వాలి అంటే కచ్చితంగా బిచ్చగాడు తోనే రావాలని విజయ్ ఆంటోని భావించినట్లు ఉన్నాడు.అందుకే బిచ్చగాడు( Bichagadu) చిత్రానికి సీక్వెల్ రూపొందించాడు.
ఆ మధ్య బిచ్చగాడు 2( Bichagadu 2 ) షూటింగ్ సందర్భంగా ఘోర యాక్సిడెంట్ అయ్యింది.ఆ కారణంగా రెండు నెలలు పూర్తిగా బెడ్ కే పరిమితమైన విజయ్ ఆంటోని ఎట్టకేలకు తిరిగి షూటింగ్ కి జాయిన్ అయి షూటింగ్ ని పూర్తి చేసి విడుదలకు సిద్ధం చేస్తున్నాడు.వచ్చే నెలలో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న బిచ్చగాడు సినిమా కు సంబంధించిన ట్రైలర్ తాజాగా విడుదలైంది.మొదటి పార్ట్ తో పోలిస్తే రెండవ పార్ట్ ఏ మాత్రం ఆకట్టుకునే విధంగా లేదు అంటూ ట్రైలర్ చూసే తెలుగు ప్రేక్షకులు పెద్ద విరుస్తున్నారు.
అందులో తల్లి సెంటిమెంట్( Mother Sentiment ) ఉంటుంది.ఇందులో అది కనిపించడం లేదని కొందరు కామెంట్ చేస్తున్నారు.బిచ్చగాడు అంటే తల్లి సెంటిమెంటు సినిమా, దాన్ని కచ్చితంగా దీంట్లో కూడా పాటించాల్సిందే అంటూ కొందరు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.బిచ్చగాడు 2 సినిమా ను తెలుగు ప్రేక్షకులు ఎంత వరకు ఆధరిస్తారు అంటే అనుమానమే అన్నట్లుగా కొందరు కామెంట్స్ చేస్తున్నారు.
బిచ్చగాడు మొదటి పార్ట్ ను చూసిన వారు సీక్వెల్ కోసం వెయిట్ చేస్తున్న మాట వాస్తవం.కానీ సినిమా ఎలా ఉంటుందో మరి.!