రజినీకాంత్ సర్ మీకు అవసరమా ఇలాంటి విమర్శలు?

దివంగత మాజీ ముఖ్యమంత్రి సీనియర్ స్టార్ హీరో నందమూరి తారక రామారావు( Nandamuri Taraka Ramarao ) 100వ జయంతి ఉత్సవాల్లో భాగంగా జరిగిన కార్యక్రమాల్లో మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఎమ్మెల్యే బాలకృష్ణ లతో పాటు తమిళ సూపర్‌ స్టార్‌ రజనీకాంత్ కూడా పాల్గొన్నారు.ఈ సందర్భంగా రజినీకాంత్ మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు పై ప్రశంసల వర్షం కురిపించారు.

 Kodali Nani Comments About Super Star Rajinikanth,kodali Nani,rajinikanth,ycp Le-TeluguStop.com

ఒకప్పటి హైదరాబాదు ఇప్పటి హైదరాబాద్( Hyderabad ) కి ఎంతో తేడా ఉందని అందుకు కారణం చంద్రబాబు నాయుడు అంటూ రజనీ కాంత్ చేసిన వ్యాఖ్యలు వైకాపా నేతలకు మింగుడు పడడం లేదు.దాంతో చుట్టపు చూపుగా వచ్చి నాలుగు మాటలు మాట్లాడి వెళ్లిన రజనీకాంత్( Rajinikanth ) వైకాపా నాయకులు తీవ్ర స్థాయిలో మండి పడుతున్నారు.

ముఖ్యంగా మాజీ మంత్రి కొడాలి నాని( Ex Minister Kodali Nani ) చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం సోషల్ మీడియా లో వైరల్ అవుతున్నాయి.అంతే కాకుండా సూపర్ స్టార్ రజనీకాంత్ అభిమానులకు కూడా మనస్థాపాన్ని గురి చేస్తున్నాయి.మూడు రోజులు షూటింగ్ చేస్తే నాలుగు రోజులు ఆసుపత్రి లో పడుకునే రజనీకాంత్ వచ్చి చంద్ర బాబు నాయుడు గురించి మాట్లాడటం విడ్డూరంగా ఉంది అంటూ కొడాలి నాని తీవ్రంగా స్పందించాడు.అంతే కాకుండా రజనీకాంత్ కి సిగ్గు శరం లేదని.

ఒకప్పుడు ఎన్టీఆర్ పై చెప్పులు వేసిన చంద్రబాబు నాయుడు( Chandrababu Naidu ) కి మద్దతు తెలిపి ఇప్పుడు మళ్లీ ఎన్టీఆర్ జయంతి( NTR Shatajayanthi Celebrations ) కి ఎలా హాజరవుతారు అంటూ కొడాలి నాని ప్రశ్నించారు.రజినీకాంత్ పై మరీ అంతటి విమర్శలు అవసరమా అంటూ కొందరు కొడాలి నాని తీరుని తప్పుపడుతున్నారు.

రజనీ కాంత్ సార్ మీకు ఇలాంటి విమర్శలు అవసరమా అంటూ కొందరు అభిమానులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.కొడాలి నాని వ్యాఖ్యలు తమిళ రజనీకాంత్ అభిమానులకు అర్థమైతే పరిస్థితి ఏంటో.!

.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube