చిత్తూరు జిల్లా కుప్పంలో టెన్షన్ వాతావరణం ఏర్పడింది.టీడీపీ, వైసీపీ వర్గీయుల మధ్య వివాదం చెలరేగింది.
కుప్పం మున్సిపల్ తెలుగు యువత అధ్యక్షులు బాలు ఇంటిపై వైసీపీ వర్గీయులు రాళ్లు, కర్రలతో దాడులకు పాల్పడ్డారని తెలుస్తోంది.ఈ ఘటనలో బైకు దగ్ధమైంది.
ఈ నేపథ్యంలో బాలు ఇంటి వద్ద రెండు పార్టీలకు చెందిన కార్యకర్తలు భారీగా చేరుకోవడంతో ఘర్షణ నెలకొంది.దీంతో తీవ్ర ఉద్రిక్తత ఏర్పడింది.
సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని రెండు వర్గాలను చెదరగొట్టారు.అయితే లక్ష్మీపురంలో జరిగిన జాతర సందర్భంగా తలెత్తిన వివాదం కారణంగానే వైసీపీ, టీడీపీ వర్గీయుల మధ్య చిచ్చు రాజుకుందని పోలీసులు భావిస్తున్నారు.







