Dasara : దసరా మూవీలోని ఆ సీన్ అక్కడ నిజంగానే జరిగిందా.. నెట్టింట న్యూస్ వైరల్?

డైరెక్టర్ శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో నాని, కీర్తి సురేష్ హీరో హీరోయిన్ లుగా నటించిన చిత్రం దసరా( Dasara ).ఈ సినిమా గత నెల మార్చి 30వ తేదీన విడుదల అయ్యి సూపర్ హిట్ టాక్ ని అందుకున్న విషయం తెలిసిందే.

 Interesting Details About Dasara Movie Interval Scene-TeluguStop.com

ఈ సినిమా దాదాపు 100 కోట్లకు పైగా వసూలను రాబట్టిన సంగతి తెలిసిందే అంతేకాకుండా ఈ సినిమాలో హీరో హీరోయిన్ ల నటనకు గాను మంచి మార్కులే పడ్డాయి.థియేటర్లో మంచి సక్సెస్ సాధించిన ఈ సినిమా తాజాగా ఓటీటీ లోకి విడుదల అయింది.

ఈ సినిమా స్ట్రీమింగ్‌ హక్కులను నెట్‌ఫ్లిక్స్‌ సొంతం చేసుకుంది.ఏప్రిల్‌ 27 నుంచి ఈ చిత్రం నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ అవుతోంది.

Telugu Dasara, Interval Scene, Karamchedu, Nani, Srikanth Odela, Tollywood-Movie

ఓటీటీలో కూడా ఈ మూవీకి భారీగా ప్రేక్షకాధరణ లభిస్తోంది.ఇది ఇలా ఉంటే ఈ సినిమాలో ఇంటర్వెల్ కు ముందు వచ్చిన సీన్ ని చూసి చాలామంది కారంచేడు సంఘటనను గుర్తు చేసుకుంటున్నారు.దసరా సినిమాలో వచ్చిన ఈ సన్నివేశం కారంచేడు ఘటన ఆధారంగానే తెరకెక్కించారా అని చర్చించుకుంటున్నారు.ఈ కారంచేడు ఘటన ఏంటి అన్న విషయంలోకి వెళ్తే ఏం జరిగింది అంటే.

నందమూరి తారక రామరావు( Nandamuri Taraka Ramarao )1984లో తెలుగు దేశం పార్టీ<స్థాపించి ఆరు నెలల్లోనే అధికారంలోకి వచ్చాడు.ఆ తర్వాత 1985 జులై 17 ప్రకాశం జిల్లా, కారంచేడులో దారుణం చోటు చేసుకుంది.

ఈ దారుణం జరిగి ఇప్పటికి 38 ఏళ్లు.

Telugu Dasara, Interval Scene, Karamchedu, Nani, Srikanth Odela, Tollywood-Movie

రెండు సామాజిక వర్గాల మధ్య తాగు నీటి చెరువు వద్ద చోటు చేసుకున్న ఘర్షణ ఒళ్లు గగుర్పొడిచే నరమేధానికి దారి తీసింది.ఒక వర్గం జనాలు మరో వర్గం వారి వెంటపడ్డారు.కత్తులు, బరిసెలు, గండ్రగొడ్డళ్లు సహా మారణాయుధాలు పట్టుకుని తెగబడ్డారు.

వెంటాడి, వేటాడి మరి ఊచ కోత కోశారు.ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ చరిత్రలో ఈ ఘటన మాయని మచ్చగా మిగిలిపోయింది.

అయితే ఈ ఘటన తరువాత పీపుల్స్‌ వార్‌ గ్రూప్‌కు చెందిన మావోయిస్టులు ఎన్టీఆర్‌ అల్లుడు దగ్గుబాటి వెంకటేశ్వరరావు తండ్రి చెంచు రామయ్యను హత్య చేశారు.

Telugu Dasara, Interval Scene, Karamchedu, Nani, Srikanth Odela, Tollywood-Movie

ఆ తర్వాత ప్రభుత్వం ఎన్ని నష్ట నివారణ చర్యలు తీసుకున్నా కూడా ఫలితం లేకుండా పోయింది.1989 ఎన్నికల్లో టీడీపీ ( TDP )అధికారం కోల్పోయింది.ఇక దసరాలో ఇంట్రవెల్‌కు ముందు ఇలాంటి సన్నివేశమే వస్తుంది.

విలన్‌ గ్యాంగ్‌ నాని, అతడి స్నేహితులను వెంటాడి, వేటాడి మరి దారుణంగా హత్య చేస్తుంది.ఆ తర్వాత ఆ నెపాన్ని నక్సలైట్ల మీదకు తోస్తారు.

ఈ సీన్లు చూసిన మధ్యవయస్కులు నాటి కారంచేడు ఘటననే గుర్తు చేసుకుంటున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube