యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్( Junior NTR ) ప్రతిభ గురించి ఎంత చెప్పుకున్నా తక్కువేనని చెప్పవచ్చు.ఎలాంటి రోల్ ఇచ్చినా నూటికి నూరు శాతం న్యాయం చేసి ప్రశంసలు పొందడంతో పాటు విజయాలను అందుకోవడం తారక్ కు మాత్రమే సాధ్యమవుతుంది.2015 సంవత్సరం నుంచి తారక్ కు కెరీర్ పరంగా తిరుగులేదు.ఫ్లాపుల్లో ఉన్న డైరెక్టర్లకు సైతం హిట్లు ఇస్తున్న హీరోగా యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ పేరు తెచ్చుకున్నారు.

ఆర్.ఆర్.ఆర్( RRR) తో కెరీర్ బిగ్గెస్ట్ హిట్ అందుకున్న తారక్ హాలీవుడ్ లెవెల్ లో కూడా సత్తా చాటడానికి ఎంతో సమయం పట్టదని కామెంట్లు వినిపిస్తున్నాయి.హాలీవుడ్ డైరెక్టర్లు( Hollywood Directors ) తారక్ తో పని చేయడానికి ఆసక్తి చూపిస్తున్న నేపథ్యంలో త్వరలో తారక్ హాలీవుడ్ ప్రాజెక్ట్ ల ప్రకటన ఉండబోతుందని ప్రచారం జరుగుతోంది.
అయితే ఇంత ప్రతిభ, వాగ్ధాటి, ఊహించని స్థాయిలో సక్సెస్ రేట్ ఉన్న తారక్ ను కావాలనే తొక్కేస్తున్నారని కామెంట్లు వినిపిస్తున్నాయి.

నందమూరి కుటుంబం( Nandammuri Family )లో ఎన్ని గొడవలు అయినా ఉండవచ్చని అయితే ఆ గొడవల వల్ల ఎన్టీఆర్ ను అవమానించడం సరికాదని ఫ్యాన్స్ చెబుతున్నారు.ఎన్టీఆర్ శతజయంతి( NTR Centenary Celebrations ) ఉత్సవాలకు తారక్ ను ఆహ్వానించకపోవడం అంటే అలా చేయడం ముమ్మాటికీ తప్పేనని కామెంట్లు వినిపిస్తున్నాయి.రాజకీయాల్లో సైతం సంచలనాలు సృష్టించే సామర్థ్యం ఉన్న జూనియర్ ఎన్టీఆర్ ను దూరం పెడితే టీడీపీకే నష్టమని ఫ్యాన్స్ భావిస్తున్నారు.

తారక్ ను తొక్కేయడానికి ప్రయత్నించవద్దని ఫ్యాన్స్ కోరుతున్నారు. నందమూరి, టీడీపీ అభిమానులు ( TDP ) రెండుగా విడిపోయేలా చేయవద్దని బాలయ్య( Balakrishna ) జోక్యం చేసుకుని చిన్నాచితకా సమస్యలు ఉంటే పరిష్కరించాలని ఫ్యాన్స్ సూచిస్తున్నారు.ఈ పరిస్థితి రిపీట్ కాకూడదని అభిమానులు ఆశిస్తున్నారు.అపర చాణిక్యుడిగా పేరు సంపాదించుకున్న చంద్రబాబు జూనియర్ ఎన్టీఆర్ విషయంలో చేస్తున్నది పొరపాటేనని చెప్పవచ్చు.







