సౌత్ ఇండస్ట్రీలో నటిగా ఎంతో పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్న తమన్నా( Tamannaah ) ప్రస్తుతం బాలీవుడ్ ఇండస్ట్రీలో కూడా పలు సినిమాలలో వెబ్ సిరీస్ లలో నటిస్తూ బిజీగా ఉన్నారు.ఇలా ఇండస్ట్రీలోకి వచ్చి తమన్న దాదాపు 17 సంవత్సరాలు అవుతున్నప్పటికీ ఏమాత్రం అవకాశాలు కోల్పోకుండా వరుస అవకాశాలను అందుకుంటూ ఇండస్ట్రీలో కొనసాగుతున్నారు.
ఇలా హీరోయిన్ గా ఎంతో బిజీగా గడుపుతున్న తమన్నా గత కొంతకాలంగా తన వ్యక్తిగత కారణాల వల్ల వార్తల్లో నిలుస్తున్నారు.తమన్నా బాలీవుడ్ నటుడు విజయ్ వర్మ( Vijay Varma )ను ప్రేమిస్తున్నారంటూ గత కొద్ది రోజులుగా వార్తలు వస్తున్నాయి.
ఇలా వీరిద్దరూ ప్రేమలో ఉన్నారని అందుకు అనుకున్నంగానే వీరిద్దరూ కలిసి జంటగా ముంబై వీధులలో తిరగడం, రెస్టారెంట్లకు వెళ్లడం, ఫంక్షన్లకు హాజరు కావడంతో ఇద్దరు నిజంగానే డేటింగ్ లో ఉన్నారని అయితే ఈ విషయాన్ని బయటకు చెప్పడం లేదని పలువురు భావిస్తున్నారు.ఇలా వార్తలు వస్తున్న ప్రతిసారి తమన్న ఈ వార్తలను ఖండించే ప్రయత్నం చేసిన తిరిగి వీరిద్దరు జంటగా కనిపించడంతో తరచూ వీరి డేటింగ్ రూమర్స్ వైరల్ అవుతున్నాయి.తాజాగా వీరిద్దరూ డిన్నర్ డేట్ కోసం ముంబైలో ఓ రెస్టారెంట్ కు వెళ్లిన విషయం కూడా తెలిసిందే.
ఇలా వీరి వ్యవహార శైలి చూస్తే త్వరలోనే తమన్నా విజయ్ వర్మ వారి ప్రేమ విషయాన్ని అఫీషియల్ గా ప్రకటించబోతున్నారని అందరూ భావిస్తున్నారు.ఇదిలా ఉండగా తమన్నాను నటుడు విజయేంద్ర వర్మను చాలా ముద్దుగా తనని ముద్దు పేరుతో పిలుస్తారట మరి ఈయన తమన్నాను పిలిచే ఆ ముద్దు పేరు ఏంటి అనే విషయానికి వస్తే… తమటార్ అంటూ విజయ్ వర్మ తమన్నాను ముద్దుగా పిలుస్తారని తెలుస్తోంది.ఇక తమన్నా సినిమాల విషయానికొస్తే ప్రస్తుతం ఈమె మెగాస్టార్ చిరంజీవి( Chiranjeevi )తో కలిసి భోళా శంకర్ సినిమాలో నటిస్తున్నారు.
అలాగే రజనీకాంత్ జైలర్ సినిమాలో కూడా తమన్నా నటిస్తున్నారు.