వైసీపీ ప్రభుత్వంపై టీడీపీ నేత, మాజీ మంత్రి సోమిరెడ్డి తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు.తాడేపల్లి ఫైల్స్ అనే పేరుతో సినిమా తీస్తే ఐదారు సీక్వెల్స్ తీయాల్సి వస్తుందని విమర్శించారు.
ఏపీలో మైనింగ్ చట్టం జగన్ పాదాల కింద నలిగిపోతుందని ఆరోపించారు.జగన్ సీఎం అయ్యాక తమపై ఎన్నో కేసులు బుక్ చేశారని మండిపడ్డారు.
ప్రభుత్వానికి నచ్చని విధంగా ఏమైనా చేస్తే చంపేస్తున్నారన్నారు.జగన్ బాబాయ్ హత్య, ఓ బాబాయ్ జైలుకు వెళ్లారు…జగన్ మరో తమ్ముడు జైలుకు వెళ్లబోతున్నారని జోస్యం చెప్పారు.
ఏపీలో ఇంత దారుణంగా ఉంటే కేంద్రం ఏం చేస్తోందని ప్రశ్నించారు.