అక్కినేని హీరోల టైమ్ అస్సలు బాలేదా.. ముగ్గురు హీరోలకు ఫ్లాపులే మిగిలాయా?

టాలీవుడ్ ఇండస్ట్రీలో అక్కినేని హీరోలకు ఉన్న క్రేజ్ అంతాఇంతా కాదు.నాగార్జున, నాగచైతన్య, అఖిల్( Akhil Akkineni ) వరుస సినిమాలతో కెరీర్ పరంగా బిజీగా ఉన్నారు.

 Huge Shocks To Akkineni Heroes Details Here Goes Viral In Social Media, Social-TeluguStop.com

అయితే ఈ హీరోలకు సక్సెస్ రేట్ మాత్రం అంతకంతకూ తగ్గుతోంది.అక్కినేని హీరోల టైం అస్సలు బాలేదని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.

నాగార్జున గత కొన్నేళ్లలో నటించిన సినిమాలలో సోగ్గాడే చిన్నినాయన, ఊపిరి, బంగార్రాజు( Bangarraju ) మినహా మరే సినిమా ఆకట్టుకోలేదు.

అక్కినేని అఖిల్ కెరీర్ విషయానికి ఇప్పటివరకు కెరీర్ పరంగా ఒక్క బ్లాక్ బస్టర్ హిట్ లేదు.మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్( Most Eligible Bachelor ) సినిమా హిట్ అయినా ఈ సినిమా భారీ బ్లాక్ బస్టర్ హిట్ అయితే కాదనే సంగతి తెలిసిందే.అక్కినేని హీరోలలో మరో హీరో అయిన నాగచైతన్య గత రెండు సినిమాలు బాక్సాఫీస్ వద్ద ఫ్లాప్ అయ్యాయి.

థాంక్యూ, లాల్ సింగ్ ఛడ్డా సినిమాలు ఒక సినిమాను మించి మరొకటి నష్టాలను మిగిల్చాయి.

అక్కినేని హీరోలకు ప్రస్తుతం టైమ్ అస్సలు బాలేదని అందుకే ఇలాంటి ఫలితాలు ఎదురవుతున్నాయని ఫ్యాన్స్ కామెంట్లు చేస్తున్నారు.అక్కినేని హీరోలు కథల ఎంపికలో, దర్శకుల ఎంపికలో మారాల్సిన సమయం ఆసన్నమైందని మరి కొందరు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.అక్కినేని హీరోలు ఈ కామెంట్లపై ఏ విధంగా స్పందిస్తారో చూడాల్సి ఉంది.

మరో రెండు వారాల్లో నాగచైతన్య నటించిన కస్టడీ మూవీ రిలీజ్ కానుండగా ఈ సినిమా అయినా అంచనాలను అందుకుంటుందేమో చూడాలి.అక్కినేని స్టార్ హీరోలకు వరుస షాకులు తగులుతుండటం గమనార్హం.నాగార్జున అయినా కొడుకుల కెరీర్ పై దృష్టి పెట్టాల్సి ఉందని కొంతమంది అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.కథల ఎంపికలో అక్కినేని హీరోలు చేస్తున్న పొరపాట్లు ఆ హీరోలకు శాపంగా మారుతున్నాయని అభిప్రాయాలు వ్యక్తమవుతూ ఉండటం గమనార్హం.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube