టాలీవుడ్ ఇండస్ట్రీకి చెందిన సినిమాలలో కొన్ని సినిమాలకు ఓటీటీలు( OTT ) ఊహించని స్థాయిలో ప్రచారం కల్పిస్తుండగా మరికొన్ని సినిమాలకు మాత్రం ఓటీటీలు తగిన స్థాయిలో ప్రచారం కల్పించడం లేదు.భారీ మొత్తాలకు హక్కులను కొనుగోలు చేస్తున్న ఓటీటీలు సినిమా థియేట్రికల్ రిజల్ట్ ను బట్టి ఓటీటీ ప్రచారం విషయంలో జాగ్రత్తగా ఆచితూచి అడుగులు వేస్తుండటం గమనార్హం.
సినిమా ఫ్లాప్ అయితే ఓటీటీలు కూడా లైట్ తీసుకుంటుండటం సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అవుతోంది.హంట్, రంగమార్తాండ, అమిగోస్, రావణాసుర సినిమాలు పెద్దగా ప్రచారం లేకుండానే ఓటీటీలో విడుదల కావడం గమనార్హం.
థియేటర్లలో సినిమా ఫ్లాప్ అయితే ఓటీటీలు స్టార్ హీరోల పరువు తీస్తున్నాయని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.ఓటీటీ సంస్థలు భారీ మొత్తాలకు పెద్ద సినిమాల డిజిటల్ హక్కులు తీసుకుంటున్నాయి.

పెద్ద సినిమాలు ఫ్లాప్ అయితే ఓటీటీలకు సైతం భారీ స్థాయిలో నష్టాలు మిగులుతున్నాయని అభిప్రాయాలు వ్యక్తమవుతూ ఉండటం గమనార్హం.మరోవైపు తెలుగు సినిమాల సక్సెస్ రేట్ తగ్గుతోంది.ఈ నెలలో విడుదలైన సినిమాలలో విరూపాక్ష ( Virupaksha ) మినహా మరే సినిమా ప్రేక్షకులను ఆకట్టుకోలేదు.ఏజెంట్ సినిమా( Agent Movie ) కూడా డిజాస్టర్ల జాబితాలో చేరింది.
ఈ మూవీ తక్కువ సమయంలోనే ఓటీటీలో అందుబాటులోకి వచ్చే ఛాన్స్ ఉంది.

పెద్ద సినిమాలు ఇదే విధంగా షాక్ ఇస్తే మాత్రం రాబోయే రోజుల్లో ఓటీటీ సంస్థలు తక్కువ మొత్తానికే పెద్ద సినిమాల హక్కులను కొనుగోలు చేసే ఛాన్స్ అయితే ఉంది.ఓటీటీలను నమ్ముకుని కథ, కథనం లేకుండా సినిమాలు తీస్తే మాత్రం భారీ షాక్ తప్పదని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.ఓటీటీ సంస్థలు ఊహించని స్థాయిలో పెద్ద సినిమాలపై ఇన్వెస్ట్ చేస్తుండటం గమనార్హం.
అన్ని భాషల హక్కులను ప్రముఖ ఓటీటీ సంస్థలు కొనుగోలు చేస్తుండటం గమనార్హం.







