కామారెడ్డి జిల్లాలో ఫారెస్ట్ అధికారులను దుర్గమ్మగుడి తండా గ్రామస్తులు నిర్బంధించారు.తండాలో అటవీ భూమిని చదును చేస్తున్న గ్రామస్తులను ఫారెస్ట్ అధికారులు అడ్డుకున్నారు.
దీంతో కోపోద్రిక్తులైన తండా వాసులు అధికారులతో వాగ్వివాదానికి దిగి, అనంతరం వారిని నిర్బంధించారు.బీట్ ఆఫీసర్ ప్రశాంత్ ఉన్నతాధికారులకు సమాచారం అందించారు.
ఈ క్రమంలో తండా వాసులను చెదరగొట్టిన అధికారులు విధులకు ఆటంకం కలిగించిన వారిపై పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు.







