మంచు కొండల్లో వారితో చిల్ అవుతున్న సుధీర్.. వైరల్ అవుతున్న ఫోటోలు!

సుడిగాలి సుదీర్(Sudigali Sudheer) పరిచయం అవసరం లేని పేరు మిమిక్రీ ఆర్టిస్ట్ గా జీవనం కొనసాగిస్తున్నటువంటి ఈయనకు వేణు(Venu) జబర్దస్త్ కార్యక్రమంలో అవకాశం కల్పించారు.ఇలా వేణు టీం లో కమెడియన్ గా స్కిట్ లో నటిస్తూ ఉన్నటువంటి సుదీర్ జీవితం కూడా సుడిగాలి ఉన్నత శిఖరాలకు చేరుకుంటుందని చెప్పాలి.

 Sudigali Sudheer Chilling With Venu And Getup Srinu Photo Viral Details, Balagam-TeluguStop.com

ఇలా కమెడియన్ గా ప్రారంభమైన తన జీవితం టీం లీడర్ గాను అలాగే యాంకర్ గాను కొనసాగుతూ వచ్చారు.ఇలా బుల్లితెరపై అంచలంచలుగా ఎదుగుతున్న సుధీర్ బుల్లితెర మెగాస్టార్ గా పేరు సంపాదించుకున్నారు.

అయితే ప్రస్తుతం తనకు సినిమా అవకాశాలు రావడంతో ఇండస్ట్రీలో బిజీగా ఉన్నారు.

తాజాగా గాలోడు సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చి ఎంతో అద్భుతమైన విజయాన్ని అందుకున్న సుదీర్ ప్రస్తుతం తదుపరి సినిమాల షూటింగ్ పనులలో బిజీగా ఉన్నారు.ఇలా కెరియర్లో ఎంతో పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్న సుదీర్ ఈ స్థాయికి చేరుకున్నారు అంటే అందుకు గల కారణం వేణు అని చెప్పాలి.ఆయన అవకాశం ఇవ్వడంతోనే జబర్దస్త్ కార్యక్రమంలోకి ఎంట్రీ ఇచ్చి తన టాలెంట్ ఏంటో నిరూపించుకున్నారు.

ఇక సుధీర్ తో పాటు గెటప్ శ్రీను ఆటో రాంప్రసాద్ కూడా అదే స్థాయిలో పేరు సంపాదించుకున్నారు.ఇక వేణు మాత్రం జబర్దస్త్ నుంచి బయటకు వచ్చి డైరెక్టర్ గా మారిపోయారు.

తాజాగా ఈయన బలగం(Balagam) సినిమా ద్వారా ఇండస్ట్రీకి డైరెక్టర్గా పరిచయమయ్యారు.ఈ సినిమా ఎలాంటి సక్సెస్ అందుకుందో మనకు తెలిసిందే.ఈ సినిమా ద్వారా ఈయన ఏకంగా ఇంటర్నేషనల్ అవార్డ్స్ కూడా కైవసం చేసుకుంటున్నారు.ఇలా ఈ సినిమా మంచి సక్సెస్ కావడంతో డైరెక్టర్ వేణుతో పాటు సుడిగాలి సుదీర్ గెటప్ శ్రీను(Getup Srinu) ముగ్గురు కలిసి వెకేషన్ కి వెళ్ళినట్టు తెలుస్తుంది.

ఈ క్రమంలోని ఈ ముగ్గురు మంచు కొండల్లో చాలా చిల్ అవుతూ ఎంజాయ్ చేస్తున్నారు .ఇలా ఈ ముగ్గురు కలిసి ఉన్నటువంటి ఫోటోని సుధీర్ సోషల్ మీడియా వేదికగా షేర్ చేస్తూ మా మ్యాడ్ నేస్ ఎప్పటికీ మారదు అంటూ రాసుకొచ్చారు.ఇక ఈ ఫొటోస్ వైరల్ గా మారడంతో పలువురు ఈ ఫోటో పై కామెంట్ చేస్తూ రష్మీ(Rashmi) ఎక్కడ సుధీర్ భయ్యా అంటూ కామెంట్లు చేస్తున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube