పులితో పరాచికాలా... టూరిస్ట్‌ని పరుగులంకించిన పులి!

సోషల్ మీడియా వినియోగం రోజురోజుకీ పెరిగిపోతుండడంతో ఎక్కడలేని వీడియోలు వైరల్ అవుతూ వున్నాయి.అందులో మనం ఈ జీవితంలో చూడలేని దృశ్యాలు కూడా కనబడుతూ ఉంటాయి.

 The Tiger That Ran The Tourist ,tourist , Tiger , Viral News , Viral Video , Ti-TeluguStop.com

ఉదాహరణకు ఇక్కడ అందరూ ఇతర దేశాలకు వెళ్లలేకపోవచ్చు, అదేవిధంగా అక్కడ సంస్కృతీ సంప్రదాయాలను తెలుసుకోలేకపోవచ్చు.కాని నేడు ఆ పరిస్థితి లేదు.

సోషల్ మీడియా పుణ్యమాని ఇతర మనుషుల ఆచార వ్యవహారాల గురించి చాలా తేలికగా తెలుసుకోగలుగుతున్నాం.

అసలు విషయంలోకి వెళితే, ఈమధ్య కాలంలో జంతువులకు సంబందించిన వీడియోలు ఎక్కువగా వైరల్ కావడం మనం చూస్తూ వున్నాం.తాజాగా అలా సేదతీరుదామని సరదాగా ఓ పార్క్‌లోకి వెళ్లిన టూరిస్టులకు వింత అనుభవం ఎదురైంది.ఓ పులి( tiger ) వారిని వెంబడించడంతో పరుగులు తీశారు.

కాగా, దీనికి సంబంధించిన వీడియోను ఐఎఫ్‌ఎస్‌ అధికారి సుశాంత్‌ నంద ట్విట్టర్‌లో షేర్‌ చేయగా ప్రస్తుతం ఆ వీడియో వైరల్ అవుతోంది.

విషయంలోకి వెళితే, ఉత్తరాఖండ్‌( Uttarakhand )లోని జిమ్‌ కార్బెట్‌ నేషనల్‌ పార్క్‌లోకి సఫారీలో కొంతమంది పర్యాటకులు వెళ్లడం జరిగింది.ఈ నేపథ్యంలో అక్కడ ఉన్న వన్యప్రాణుల్ని ఎంతో ఆసక్తిగా తిలకిస్తూ, వాటి చిత్రాలని తమ కెమెరాల్లో బంధిస్తున్నారు.ఆ సమయంలో ఓ చోట పొదల్లో వారికి పెద్ద పులి కనిపించింది.

దీంతో సఫారీ జీప్‌ డ్రైవర్‌ ( Safari Jeep Driver )కాసేపు వాహనాన్ని అక్కడే నిలిపివేయడంతో.పర్యాటకులు పులిని ఫొటోలు, వీడియోలు తీసుకొనే పనిలో మునిగిపోయారు.ఈ క్రమంలో పులికి తిక్కరేగిందో ఏమో గాని, ఒక్కసారిగా వారిపై దాడి చేసే ప్రయత్నం చేయగా పర్యాటకులు భయంతో కేకలు వేసి, అక్కడినుండి పారిపోయారు.ఈ వీడియో సోషల్‌ మీడియాలో ప్రస్తుతం వైరల్‌గా మారింది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube