మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi)ఇక మీదట రీమేక్ లను చేయకూడదని ఫిక్స్ అయ్యాడు.రీ ఎంట్రీ తర్వాత తన ఇమేజ్ కు సరైన కథలు రావట్లేదని రీమేక్ లపై పడిన చిరు ఆ సినిమాల ఫలితాలు చూసి నిరాశ చెందాడు.
అందుకే యువ దర్శకులకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చేందుకు రెడీ అంటున్నాడు.ఆల్రెడీ బింబిసార(Bimbisara) వశిష్టతో చిరు సినిమా ఉంటుందని టాక్.
మరో యువ దర్శకుడితో కూడా చిరు సంప్రదింపులు జరుపుతున్నారట.
ఇదిలాఉంటే రీసెంట్ గా సూపర్ హిట్ అందుకున్న దసరా డైరెక్టర్ శ్రీకాంత్ ఓదెల(Srikanth Odela)కి మెగాస్టార్ నుంచి పిలుపు వచ్చిందని టాక్.నానితో దసరా (Dussehra, Nani)లాంటి సినిమా చేసిన శ్రీకాంత్ ఓదెల చిరు మనసు గెలిచాడు.అందుకే తనకు సూటయ్యే కథ రెడీ చై సినిమా చేసేద్దాం అనేశారట.
ఓ విధంగా శ్రీకాంత్ ఓదెలకు ఇది మెగా ఆఫర్ అని చెప్పొచ్చు.మరి చిరుకి నచ్చే కథతో వస్తే శ్రీకాంత్ ఓదెలతో మెగా మూవీ ఫిక్స్ అయినట్టే లెక్క.
చిరు అందరు యువ దర్శకులకు ఇదే ఆఫర్ ఇస్తున్నారని టాక్.మరి శ్రీకాంత్ ఓదెలది ఎన్నో నెంబర్ అంటూ కొందరు కామెంట్స్ చేస్తున్నారు.
ఏది ఏమైనా చిరు దసరా కాంబో ఓ రేంజ్ లో ఉంటుందని చెప్పొచ్చు.