సాయిరెడ్డి తో ఎక్కడ చెడిందో ? లోటు కనిపిస్తోంది గా 

2019 ఎన్నికల్లో వైసిపి( YCP ) అఖండ మెజారిటీతో విజయం సాధించింది అంటే దానికి కారణం ఆ పార్టీ అధినేత జగన్, అలాగే వైసిపి సోషల్ మీడియా తో పాటు విజయ్ సాయి రెడ్డి ( Vijay Sai Reddy )పాత్ర కీలకమే.జగన్ కు అన్ని విషయాలలోనూ చేదోడువాదోడుగా ఉంటూ పార్టీని అధికారంలోకి తీసుకొచ్చే విషయంలో కీలక పాత్ర విజయసాయిరెడ్డి పోషించారు.

 Where Did Sai Reddy Go Wrong As The Deficit Appears, Vijayasairedyy, Ysrcp, Ap-TeluguStop.com

ఇక పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత విజయసాయిరెడ్డి కీలకంగా మారారు.పార్టీకి సంబంధించిన అన్ని విషయాల్లోనూ జగన్ ఆయన్ని సంప్రదించేవారు.

ఇక ప్రభుత్వంలోనూ,  పార్టీలోను జగన్ తర్వాత విజయ్ సాయి రెడ్డి కీలకంగా మారారు.వైసీపీ రాజ్యసభ సభ్యుడిగా ఉన్న విజయసాయిరెడ్డి ఉత్తరాంధ్ర పార్టీ వ్యవహారాలు చూసుకునేవారు.

Telugu Ap Cm Jagan, Ap, Chandrababu, Tarakaratna, Vijayasairedyy, Ysrcp-Politics

ముఖ్యంగా సోషల్ మీడియాలో ఎప్పుడు యాక్టివ్ గా ఉంటూ,  టిడిపి( TDP ),  ఆ పార్టీ అధినేత చంద్రబాబు లోకేష్ పైన సెటైర్లు వేస్తూ కనిపించేవారు.అయితే ఈ మధ్యకాలంలో విజయ్ సాయి రెడ్డి వ్యవహార శైలిలో మార్పు కనిపిస్తోంది.అలాగే జగన్ సైతం విజయ్ సాయి రెడ్డిని దూరం పెట్టినట్లుగానే వ్యవహరిస్తున్నారు.ఉత్తరాంధ్ర జిల్లాల వైసీపీ ఇన్చార్జిగాను ఆయనను తప్పించారు .వైసిపి అనుబంధ సంఘాల ఇన్చార్జిగాను నియమించి తర్వాత తప్పించారు.ఇక రెండోసారి విజయ్ సాయి రెడ్డి రాజ్యసభ సభ్యత్వం రెన్యువల్ అయిన తర్వాత జగన్( Jagan ) విజయసాయిరెడ్డి మధ్య దూరం పెరిగినట్లుగానే పరిస్థితి కనిపిస్తోంది.

ప్రస్తుతం విజయసాయిరెడ్డి ఢిల్లీ, హైదరాబాద్ కే పరిమితం అవుతున్నారు .పార్టీలో అంతగా యాక్టివ్ గా కనిపించడం లేదు.దీంతో జగన్ విజయసాయిరెడ్డి మధ్య దూరం పెరిగిందనే వాదనకు బలం చేకూరింది.దీనికి తగ్గట్టుగానే టిడిపి, చంద్రబాబు  విషయంలో విజయ్ సాయి రెడ్డి స్వరం మారింది.ఇటీవల చంద్రబాబుకు( Chandrababu ) జన్మదిన శుభాకాంక్షలు చెప్పడం కూడా వైరల్ అయింది.అలాగే సోషల్ మీడియాలోనూ టిడిపి,  ఆ పార్టీ అధినేత చంద్రబాబు పైన విజయసాయి విమర్శలు చేయడం లేదు .అలాగే టిడిపి అనుకూల మీడియాలోనూ విజయ సాయి రెడ్డికి వ్యతిరేకంగా ఎక్కడా కథనాలు రావడం లేదు.ఇక చంద్రబాబు సైతం గతంలో మాదిరిగా విజయసాయిరెడ్డి పై విమర్శలు చేయడం లేదు.

దీంతో జగన్ కు విజయసాయిరెడ్డికి మధ్య పూడ్చ లేని ఆంత దూరం పెరిగిందని, ఆ దూరం తోనే విజయ్ సాయి రెడ్డి ఇప్పుడు చంద్రబాబు విషయంలో ఈ విధంగా వ్యవహరిస్తున్నారనే అనుమానాలు కలుగుతున్నాయి.

Telugu Ap Cm Jagan, Ap, Chandrababu, Tarakaratna, Vijayasairedyy, Ysrcp-Politics

ఇటీవల నందమూరి వారసుడు తారకరత్న( Tarakaratna ) మరణించిన సమయంలో విజయ్ సాయి రెడ్డి చంద్రబాబుకు మధ్య మాటలు కలిసాయి.అనేక విషయాలపై వారు అనేకసార్లు భేటీ అయ్యి చర్చించుకున్నారు.ఇది కుటుంబ వ్యవహారంగా అంతా భావించినా ఈ విషయంలోనే జగన్ విజయ్ సాయి రెడ్డి పై సీరియస్ అయ్యారని, అప్పటి నుంచి ఆయనను దూరం పెడుతున్నారనే అనుమానాలు అందరిలోనూ కలుగుతున్నాయి.

అయితే విజయసాయి యాక్టిివ్ గా లేకపోవడం తో ఆ ప్రభావం వైసీపీలో స్పష్టంగా కనిపిస్తోంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube