మళ్ళీ బాలీవుడ్ బాట పట్టిన గ్లోబల్ బ్యూటీ.. హాలీవుడ్ లో అవకాశాలు తగ్గిపోయాయా?

బాలీవుడ్ గ్లోబల్ బ్యూటీ ప్రియాంక చోప్రా( Priyanka Chopra )గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు.ఒకప్పుడు బాలీవుడ్ సినిమా ఇండస్ట్రీలో స్టార్ హీరోల సరసన నటించి తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును ఏర్పరచుకుంది ప్రియాంక చోప్రా.

 Priyanka Chopra Re Entry To Bollywood,priyanka Chopra,bollywood,hollywood,bollyw-TeluguStop.com

అంతేకాకుండా బాలీవుడ్( Bollywood )లో స్టార్ హీరోయిన్ గా ఒక వెలుగు వెలిగింది.తర్వాత ఈమె హాలీవుడ్ కి చెక్కేసి అక్కడ కూడా వరుసగా అవకాశాలను అందుకుంటూ దూసుకుపోయింది.

హాలీవుడ్ ఒక్క షోతో వెస్ట్రన్‌ జర్నీ స్టార్ట్ చేసిన ప్రియాంక.అక్కడ సూపర్ హిట్ సినిమా ప్రాంచైజీల్లోనూ నటించి హాలీవుడ్‌ టాప్ స్టార్స్‌ లిస్ట్‌లో చేరిపోయింది.

ప్రస్తుతం హలీవుడ్ లో మోస్ట్ వాంటెడ్ హీరోయిన్స్( Most Wanted Heroines ) లో ఒకరిగా రాణిస్తున్న విషయం తెలిసిందే.ఇది ఇలా ఉంటే ఇటీవల కాలంలో ఈ ముద్దుగుమ్మ బాలీవుడ్ మీడియాతో ఎక్కువగా టచ్ లో ఉండే ప్రయత్నం చేస్తోంది.అంతేకాకుండా బాలీవుడ్ కి ఎంట్రీ ఇవ్వాలని చూస్తున్నట్టు కూడా తెలుస్తోంది.అయితే ప్రస్తుతం హాలీవుడ్( Hollywood ) లో ఆమె కెరియర్ సాఫీగానే సాగుతున్నప్పటికీ మళ్లీ బాలీవుడ్ కి ఎంట్రీ ఇవ్వాలనే చూస్తోంది.

తరచూ ఆమె బాలీవుడ్ మీడియాతో టచ్ లో ఉండడంతో ఈ వార్తలు జోరుగా వినిపిస్తున్నాయి.

హాలీవుడ్ లో అవకాశాలు బాగానే ఉన్నప్పటికీ ఈమె బాలీవుడ్ కి ఎందుకు ఎంట్రీ ఇవ్వాలనుకుంటోంది అన్న విషయం పై జోరుగానే చర్చలు కొనసాగుతున్నాయి.కొంతమంది ఈ విషయంపై స్పందిస్తూ హాలీవుడ్లో అవకాశాలు తగ్గిపోయాయి అందుకే ప్రియాంక చోప్రా మళ్ళీ బాలీవుడ్ బాట పట్టింది అంటూ కామెంట్స్ చేస్తున్నారు.అయితే ఒకప్పుడు బాలీవుడ్ లో వరుసగా అవకాశాలను అందుకున్న ఈ ముద్దుగుమ్మకు ఇప్పుడు బాలీవుడ్లో మళ్లీ అవకాశాలు వస్తాయా ప్రేక్షకులను ఆమెను ఆదరిస్తారా అన్నది తెలియాలి అంటే వేచి చూడాల్సిందే మరి.అంతేకాకుండా ఇదివరకు లాగ ప్రియాంక చోప్రా మళ్ళీ బాలీవుడ్ లో బిజీ బిజీ అవుతుందా లేదా అనేది తెలియాలి అంటే వేచి చూడాల్సిందే మరి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube