ఆ వర్గం ఓటు బ్యాంక్ పై జగన్ ఫోకస్ ! వారందరికీ పిలుపు 

రాబోయే సార్వత్రిక ఎన్నికలపై జగన్( Cm jagan ) భారీగానే ఆశలు పెట్టుకున్నారు.వై నాట్ 175 అనే నినాదాన్ని వినిపిస్తున్న జగన్ 2019 ఎన్నికల కంటే మెరుగైన ఫలితాలు సాధించాలనే లక్ష్యంతో ఉన్నారు.

 Jagan's Focus On The Vote Bank Of Sc Community Calling Them All , Jagan, Ap C-TeluguStop.com

ఇప్పటి వరకు ఏ ప్రభుత్వం అమలు చేయని సంక్షేమ పథకాలను తమ ప్రభుత్వం అమలు చేసిందని , దీనిపై ప్రజలో సంతృప్తి ఉందని , ప్రతిపక్షాలు ఎంతగా తమపై రాద్దాంతం చేసినా, ప్రజలు నమ్మే పరిస్థితి లేదని జగన్ భావిస్తున్నారు.అలాగే సామాజిక వర్గాల వారీగాను అందరికీ పెద్ద పీట వేయడంతో వారంతా వైసీపీకి( YCP ) అనుకూలంగానే ఎన్నికల్లో ఓటు వేస్తారనే అభిప్రాయంతో జగన్ ఉన్నారు.

అయినా కొన్ని కొన్ని ప్రధాన సామాజిక వర్గాల విషయంలో మరింత అలెర్ట్ గా వ్యవహరిస్తున్నారు.

Telugu Ap Cm Jagan, Ap, Jagan, Janasena, Mainority, Ysrcp-Politics

వైసిపి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి బీసీ,  ఎస్సీ , ఎస్టీ , మైనారిటీ లకు ఎక్కువగా ప్రాధాన్యం ఇస్తున్నారు.పార్టీలోనూ,  ప్రభుత్వంలోనూ వారికే పెద్దపేట వేస్తున్నారు.

Telugu Ap Cm Jagan, Ap, Jagan, Janasena, Mainority, Ysrcp-Politics

ఇక రాబోయే ఎన్నికల్లోను ఆ సామాజిక వర్గాలే తమను అధికారంలోకి తీసుకొస్తాయని జగన్ బలంగా నమ్ముతున్నారు.దీనిలో భాగంగానే ఎస్సీ సామాజిక వర్గాన్ని మరింత దగ్గర చేసుకునేందుకు జగన్ వ్యూహాలు రచిస్తున్నారు .

దీనిలో భాగంగానే ఈనెల 24 న తాడేపల్లిలో ఎస్సీ ప్రజా ప్రతినిధులు , పార్టీ కీలక నాయకులతో జగన్ సమావేశాన్ని నిర్వహించబోతున్నారు.ఈ సమావేశంలో ఎస్సీ ఓటింగ్ వైసిపికి పూర్తిస్థాయిలో మద్దతు ఉండే విధంగా ఏం చేయాలనే విషయం పైన చర్చించబోతున్నారు.ఇప్పటికే ఈ సమావేశానికి సంబంధించి ఐ ప్యాక్ టీం కూడా అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు సమాచారం.

ఈనెల 24న జరగబోయే సమావేశానికి వైసీపీలోని ఎస్సీ వర్గాలకు చెందిన మంత్రులు , ఎమ్మెల్యేలు,  ఎమ్మెల్సీలు, ఇతర నామినేటెడ్ పదవుల్లో ఉన్నవారిని ఆహ్వానించాలని నిర్ణయించారు.

Telugu Ap Cm Jagan, Ap, Jagan, Janasena, Mainority, Ysrcp-Politics

 బడుగు, బలహీన వర్గాల ప్రజలకు అందించే పథకాల విషయంలో కొంతకాలంగా ప్రతిపక్షాలు ఏపీ ప్రభుత్వంను( AP government ) లక్ష్యంగా చేసుకునే విమర్శలు చేస్తున్న క్రమంలో,  వాటిని ఏ విధంగా తిప్పుకోట్టాలి అనే విషయంపై ఈ సమావేశంలో ప్రధానంగా చర్చించబోతున్నారట.వీటి పైన జిల్లా స్థాయిలోనూ అవగాహన కలిగించే విధంగా సమావేశాలను ఏర్పాటు చేసేందుకు జగన్ నిర్ణయం తీసుకున్నారు .  కొద్ది నెలలు క్రిందట విజయవాడలో బీసీ రాష్ట్ర స్థాయి సభను నిర్వహించారు.ఆ సభకు అనూహ్యమైన స్పందన రావడంతో,  అదే తరహాలో ఎస్సీ సభను నిర్వహించాలని నిర్ణయించారు.దీనిపైన ఈ సమావేశంలో చర్చించి నిర్ణయం తీసుకోబోతున్నట్లు సమాచారం.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube