ఆ వర్గం ఓటు బ్యాంక్ పై జగన్ ఫోకస్ ! వారందరికీ పిలుపు
TeluguStop.com
రాబోయే సార్వత్రిక ఎన్నికలపై జగన్( Cm Jagan ) భారీగానే ఆశలు పెట్టుకున్నారు.
వై నాట్ 175 అనే నినాదాన్ని వినిపిస్తున్న జగన్ 2019 ఎన్నికల కంటే మెరుగైన ఫలితాలు సాధించాలనే లక్ష్యంతో ఉన్నారు.
ఇప్పటి వరకు ఏ ప్రభుత్వం అమలు చేయని సంక్షేమ పథకాలను తమ ప్రభుత్వం అమలు చేసిందని , దీనిపై ప్రజలో సంతృప్తి ఉందని , ప్రతిపక్షాలు ఎంతగా తమపై రాద్దాంతం చేసినా, ప్రజలు నమ్మే పరిస్థితి లేదని జగన్ భావిస్తున్నారు.
అలాగే సామాజిక వర్గాల వారీగాను అందరికీ పెద్ద పీట వేయడంతో వారంతా వైసీపీకి( YCP ) అనుకూలంగానే ఎన్నికల్లో ఓటు వేస్తారనే అభిప్రాయంతో జగన్ ఉన్నారు.
అయినా కొన్ని కొన్ని ప్రధాన సామాజిక వర్గాల విషయంలో మరింత అలెర్ట్ గా వ్యవహరిస్తున్నారు.
"""/" /
వైసిపి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి బీసీ, ఎస్సీ , ఎస్టీ , మైనారిటీ లకు ఎక్కువగా ప్రాధాన్యం ఇస్తున్నారు.
పార్టీలోనూ, ప్రభుత్వంలోనూ వారికే పెద్దపేట వేస్తున్నారు. """/" /
ఇక రాబోయే ఎన్నికల్లోను ఆ సామాజిక వర్గాలే తమను అధికారంలోకి తీసుకొస్తాయని జగన్ బలంగా నమ్ముతున్నారు.
దీనిలో భాగంగానే ఎస్సీ సామాజిక వర్గాన్ని మరింత దగ్గర చేసుకునేందుకు జగన్ వ్యూహాలు రచిస్తున్నారు .
దీనిలో భాగంగానే ఈనెల 24 న తాడేపల్లిలో ఎస్సీ ప్రజా ప్రతినిధులు , పార్టీ కీలక నాయకులతో జగన్ సమావేశాన్ని నిర్వహించబోతున్నారు.
ఈ సమావేశంలో ఎస్సీ ఓటింగ్ వైసిపికి పూర్తిస్థాయిలో మద్దతు ఉండే విధంగా ఏం చేయాలనే విషయం పైన చర్చించబోతున్నారు.
ఇప్పటికే ఈ సమావేశానికి సంబంధించి ఐ ప్యాక్ టీం కూడా అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు సమాచారం.
ఈనెల 24న జరగబోయే సమావేశానికి వైసీపీలోని ఎస్సీ వర్గాలకు చెందిన మంత్రులు , ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఇతర నామినేటెడ్ పదవుల్లో ఉన్నవారిని ఆహ్వానించాలని నిర్ణయించారు.
"""/" /
బడుగు, బలహీన వర్గాల ప్రజలకు అందించే పథకాల విషయంలో కొంతకాలంగా ప్రతిపక్షాలు ఏపీ ప్రభుత్వంను( AP Government ) లక్ష్యంగా చేసుకునే విమర్శలు చేస్తున్న క్రమంలో, వాటిని ఏ విధంగా తిప్పుకోట్టాలి అనే విషయంపై ఈ సమావేశంలో ప్రధానంగా చర్చించబోతున్నారట.
వీటి పైన జిల్లా స్థాయిలోనూ అవగాహన కలిగించే విధంగా సమావేశాలను ఏర్పాటు చేసేందుకు జగన్ నిర్ణయం తీసుకున్నారు .
కొద్ది నెలలు క్రిందట విజయవాడలో బీసీ రాష్ట్ర స్థాయి సభను నిర్వహించారు.
ఆ సభకు అనూహ్యమైన స్పందన రావడంతో, అదే తరహాలో ఎస్సీ సభను నిర్వహించాలని నిర్ణయించారు.
దీనిపైన ఈ సమావేశంలో చర్చించి నిర్ణయం తీసుకోబోతున్నట్లు సమాచారం.