వైయస్ వివేకానంద రెడ్డి( YS Vivekananda Reddy ) హత్య కేసులో కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డినీ( YS Avinash Reddy ) ఐదోసారి సీబీఐ ( CBI ) విచారిస్తున్న సంగతి తెలిసిందే.నిన్న 8 గంటల పాటు విచారించగా.ఈరోజు.9 గంటలపాటు విచారించడం జరిగింది.కేసుకు సంబంధించి పలు అంశాలపై ఈనెల 25వ తారీకు వరకు సీబీఐ .వైయస్ అవినాష్ రెడ్డిని విచారించనుంది.ఈ క్రమంలో దర్యాప్తు చేసే టైంలో వీడియో మరియు ఆడియో రూపంలో విచారణ రికార్డు చేయాలని తెలంగాణ హైకోర్టు.సీబీఐకి తెలియజేయడం జరిగింది.

ఈనెల 25 వరకు అరెస్టు చేయొద్దని సీబీఐకి హైకోర్టు స్పష్టం చేయడం జరిగింది.పరిస్థితి ఇలా ఉంటే వైఎస్ అవినాష్ రెడ్డి మధ్యంతర బెయిల్ కి వ్యతిరేకంగా వైయస్ సునీత ఈరోజు మధ్యాహ్నం సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది.రేపు విచారణకు వచ్చే అవకాశం ఉంది.ఈనెల 25 వరకు అవినాష్ ను అరెస్టు చేయకూడదని తెలంగాణ హైకోర్టు ఇచ్చిన తీర్పుకు వ్యతిరేకంగా.సుప్రీం లో సునీత వేసిన పిటిషన్ సంచలనంగా మారింది.ఈ క్రమంలో నేడు ఐదోసారి సీబీఐ విచారణలో రెండు రోజు 9 గంటలపాటు వైయస్ అవినాష్ రెడ్డిని విచారించటం జరిగింది.







