వైయస్ వివేకానంద రెడ్డి( YS Vivekananda Reddy ) హత్య కేసుకు సంబంధించి హైదరాబాద్ సీబీఐ కార్యాలయంలో నేడు కడప ఎంపీ అవినాష్ రెడ్డి( MP Avinash Reddy ) సీబీఐ విచారణ ముగిసింది.దాదాపు 8 గంటలకు పైగా సీబీఐ అధికారులు( CBI ) ప్రశ్నించడం జరిగింది.
అవినాష్ రెడ్డి తో కలిపి భాస్కర్ రెడ్డి, ఉదయ్ కుమార్ లను ప్రశ్నించినట్లు సమాచారం.

ఇదిలా ఉంటే సీబీఐ విచారణకు హాజరవ్వకముందు నిన్న తెలంగాణ హైకోర్టులో తనని అరెస్టు చేయకుండా… అవినాష్ రెడ్డి ముందస్తు బెయిల్ తెచ్చుకోవటం తెలిసిందే.ఇదిలా ఉంటే నిన్న ఇచ్చిన మధ్యంతర బెయిల్ ఉత్తర్వుల్లో హైకోర్టు కీలక అంశాలను పేర్కొంది.6 పేజీల జడ్జిమెంట్ ను ప్రకటించిన కోర్టు 19 నుండి 25వ తేదీ వరకు అవినాష్ రెడ్డి విచారణ ఎదుర్కోవాల్సి ఉంటుందని స్పష్టం చేసింది.

దాని తర్వాతే బెయిల్ పై ఫైనల్ ఆర్డర్ ఇస్తామని ప్రకటన చేయటం జరిగింది.ఇక ఇదే సమయంలో అవినాష్ రెడ్డి విచారణను. ఆడియో వీడియో రూపంలో రికార్డ్ చేసి కోర్టుకు సమర్పించాలని సీబీఐనీ.తెలంగాణ హైకోర్టు కోరింది.దీనిలో భాగంగా మొదటి రోజు సీబీఐ … దాదాపు 8 గంటలకు పైగా అవినాష్ రెడ్డినీ విచారించడం జరిగింది.







