ముగిసిన కడప ఎంపీ అవినాష్ రెడ్డి సీబీఐ విచారణ..!!
TeluguStop.com
వైయస్ వివేకానంద రెడ్డి( YS Vivekananda Reddy ) హత్య కేసుకు సంబంధించి హైదరాబాద్ సీబీఐ కార్యాలయంలో నేడు కడప ఎంపీ అవినాష్ రెడ్డి( MP Avinash Reddy ) సీబీఐ విచారణ ముగిసింది.
దాదాపు 8 గంటలకు పైగా సీబీఐ అధికారులు( CBI ) ప్రశ్నించడం జరిగింది.
అవినాష్ రెడ్డి తో కలిపి భాస్కర్ రెడ్డి, ఉదయ్ కుమార్ లను ప్రశ్నించినట్లు సమాచారం.
"""/" /
ఇదిలా ఉంటే సీబీఐ విచారణకు హాజరవ్వకముందు నిన్న తెలంగాణ హైకోర్టులో తనని అరెస్టు చేయకుండా.
అవినాష్ రెడ్డి ముందస్తు బెయిల్ తెచ్చుకోవటం తెలిసిందే.ఇదిలా ఉంటే నిన్న ఇచ్చిన మధ్యంతర బెయిల్ ఉత్తర్వుల్లో హైకోర్టు కీలక అంశాలను పేర్కొంది.
6 పేజీల జడ్జిమెంట్ ను ప్రకటించిన కోర్టు 19 నుండి 25వ తేదీ వరకు అవినాష్ రెడ్డి విచారణ ఎదుర్కోవాల్సి ఉంటుందని స్పష్టం చేసింది.
"""/" /
దాని తర్వాతే బెయిల్ పై ఫైనల్ ఆర్డర్ ఇస్తామని ప్రకటన చేయటం జరిగింది.
ఇక ఇదే సమయంలో అవినాష్ రెడ్డి విచారణను.ఆడియో వీడియో రూపంలో రికార్డ్ చేసి కోర్టుకు సమర్పించాలని సీబీఐనీ.
తెలంగాణ హైకోర్టు కోరింది.దీనిలో భాగంగా మొదటి రోజు సీబీఐ .
దాదాపు 8 గంటలకు పైగా అవినాష్ రెడ్డినీ విచారించడం జరిగింది.