అక్కినేని అఖిల్( Akkineni Akhil ) హీరో గా నటించిన ఏజెంట్( agent ) చిత్రం వచ్చే వారం ప్రేక్షకుల ముందుకు రాబోతున్న విషయం తెలిసిందే.భారీ అంచనాల నడుమ భారీ బడ్జెట్ తో ఈ సినిమా రూపొందింది.
మొదట అనుకున్న బడ్జెట్ కి దాదాపు రెట్టింపు బడ్జెట్ ఈ సినిమా కు ఖర్చు చేసినట్లుగా చెబుతున్నారు.తాజాగా విడుదలైన ట్రైలర్ చూస్తుంటే అది నిజమే అనిపిస్తుంది.
సినిమా కు 80 కోట్ల రూపాయలు ఖర్చు చేసినట్లుగా మేకర్స్ చెబుతున్నారు.కానీ అది కాస్త 100 కోట్ల కు పైగానే అయినట్లుగా ట్రైలర్ ని చూస్తుంటే అనిపిస్తుంది.
విదేశాల్లో అత్యంత ప్రతిష్టాత్మక మరియు ఖరీదైన ప్రదేశాల్లో యాక్షన్స్ సన్నివేశాలను చిత్రీకరించడం అంటే మామూలు విషయం కాదు.అందుకోసం చాలా ఖర్చు చేయాల్సి ఉంటుంది.
సురేందర్ రెడ్డి( Surender Reddy ) ఏమాత్రం వెనుకంజు వేయకుండా భారీగా ఖర్చు చేశారు అని ఈ ట్రైలర్ ను చూస్తూ ఉంటే అనిపిస్తుంది.అఖిల్ నటించిన సినిమా లు ఇప్పటి వరకు భారీగా విజయాలను సొంతం చేసుకున్న దాఖలాలు లేవు.అందుకే ఆయన కు పెద్దగా మార్కెట్ లేదు.ఆయన గత చిత్రాలన్నీ కూడా బాక్స్ ఆఫీస్ వద్ద నిరాశ పర్చాయి.దర్శకుడు సురేందర్ రెడ్డి కూడా తన గత చిత్రాలతో పోలిస్తే కాస్త డౌన్ అయ్యి ఉన్నాడు.ఇలాంటి సమయం లో ఏ ధైర్యం తో ఇంత ఖర్చు చేశారు.
ఏం నమ్మకం తో ఇంత ఖర్చు చేశారు అంటూ సినీ వర్గాల్లో మరియు మీడియా సర్కిల్స్ లో ప్రచారం జరుగుతోంది.ఈ స్థాయిలో సినిమా కు ఖర్చు చేసినప్పుడు కచ్చితంగా మంచి మ్యాటర్ ఉండాలి.మరి ఈ సినిమా లో ఆ స్థాయి మేటర్ ఉందా లేదా అనేది తెలియాలంటే మరి కొన్ని రోజులు వేచి చూడాల్సిందే.ఈ సినిమాలో మలయాళం మెగాస్టార్ మమ్ముట్టి కీలక పాత్రలో నటించాడు.
అఖిల్ బాడీ లాంగ్వేజ్( Akhil body language ) మరియు ఫిజిక్ చూస్తూ ఉంటే అభిమానులకు మరియు ప్రేక్షకులకు ఆసక్తి కలుగుతుంది అనడంలో సందేహం లేదు.కానీ ఆ స్థాయి బడ్జెట్ రికవరీ ఎంత వరకు సాధ్యం అనేది మాత్రం చూడాలి.