శ్రీకాకుళం జిల్లాలో భారీ అగ్నిప్రమాదం సంభవించింది.పలాస-కాశీబుగ్గలోని ఓ బైక్ షోరూమ్, హార్డ్ వేర్ దుకాణంలో మంటలు చెలరేగాయి.
తెల్లవారుజామున పొగలు రావడాన్ని గమనించిన స్థానికులు ఫైర్ సిబ్బందికి సమాచారం అందించారు.ఘటనా స్థలానికి చేరుకున్న ఫైర్ సిబ్బంది మూడు గంటల పాటు శ్రమించి మంటలను అదుపు చేశారు.
ఈ ప్రమాదంలో సుమారు 70 కి పైగా బైకులు దగ్ధం అయ్యాయని యజమానులు చెబుతున్నారు.అయితే షార్ట్ సర్క్యూట్ కారణంగా ప్రమాదం జరిగిందని భావిస్తున్నారు.







