మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి( YS Vivekananda Reddy ) హత్య కేసులో వైయస్సార్ ఫ్యామిలీకి చెందిన కొందరు అరెస్ట్ అవ్వడం.మరి కొందరు విచారణ ఎదుర్కోవడం ఆ ఫ్యామిలీ తో పాటు వైకాపా నేతల్లో ఆందోళన కలిగిస్తుంది.
ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి కి( CM Jagan ) స్వయానా బాబాయి అయిన వివేకానంద రెడ్డి హత్య కేసు లో అధికార పార్టీ ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి( YS Avinash Reddy ) హస్తం ఉందంటూ సిబిఐ ఆరోపణలు చేస్తున్న నేపథ్యం లో ఆ కుటుంబాని కి చెందిన వైఎస్ షర్మిల( YS Sharmila ) స్పందన ఏంటి అంటూ కొందరు రాజకీయ వర్గాల వారు ప్రశ్నిస్తున్నారు.గత కొంత కాలం గా అన్న వైయస్ జగన్మోహన్ రెడ్డి కి దూరంగా ఉంటున్న షర్మిల ఈ సమయం లో అవినాష్ రెడ్డి గురించి మాట్లాడితే బాగుంటుంది కదా అంటూ కొందరు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

బాబాయ్ వివేకానంద రెడ్డి హత్య కేసు లో అవినాష్ రెడ్డి ఉన్నాడా లేదా అనే విషయం గురించి షర్మిల మరియు విజయమ్మ ఎందుకు మాట్లాడడం లేదంటూ కొందరు ఈ సమయంలో ప్రశ్నిస్తున్నారు.ప్రస్తుతానికి ఆ విషయం తమ పరిధి కాదని, మాట్లాడాల్సిన అవసరం లేదని.విచారణ జరుగుతున్న సమయం లో ఎవరు పడితే వారు మాట్లాడటం వల్ల కేసు విచారణ తప్పు దోవ పడుతుందనే ఉద్దేశం తో తాము స్పందించడం లేదని సన్నిహితుల వద్ద షర్మిల మరియు విజయమ్మ అంటున్నారట.

అయితే వివేకానంద రెడ్డి ని హత్య చేసిన వారికి కఠిన శిక్ష పడాలని కోరుకుంటున్నట్లుగా వారు పేర్కొన్నారు.ప్రస్తుతం వైఎస్ ఫ్యామిలీ చుట్టు ఈ కేసు తిరుగుతున్న నేపథ్యంలో ముందు ముందు ఎలాంటి పరిణామాలు చోటు చేసుకుంటాయా అంటూ తీవ్ర ఆందోళన వ్యక్తం అవుతోంది.తెలంగాణ లో రాజకీయ పార్టీ ఏర్పాటు చేసి యాత్రలు చేస్తూ బలం పెంచుకునేందుకు ప్రయత్నిస్తున్న షర్మిల ఏపీ రాజకీయాల గురించి అస్సలు పట్టించుకోవడం లేదు.







