1.గూగుల్ సీఈవో హెచ్చరిక

కృత్రిమ మేధను సరైన విధంగా వినియోగించుకోకపోతే అది సమాజానికి ప్రమాదకరంగా పరిణమిస్తుందని గూగుల్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ సుందర్ పిచాయ్ అన్నారు.
2.జగన్ నీకు ఆ దమ్ముందా
కర్నూలు జిల్లాలోని దేవనకొండలో యువ గళం పాదయాత్ర నిర్వహిస్తున్న టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ జగన్ పై విమర్శలు చేశారు.తమ ప్రభుత్వంలో చేసిన అభివృద్ధిపై సెల్ఫీలు దిగే దమ్ము తమకుందని , జగన్ ఇలా సెల్ఫీలు దిగి దమ్ము నీకుందా అని లోకేష్ సవాల్ చేశారు.
3.కెసిఆర్ పై భట్టి విక్రమార్క విమర్శలు

గుడిని , గుడిలో లింగాన్ని సీఎం కేసీఆర్ మింగుతున్నాడని సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క విమర్శించారు.
4.ఢీహెచ్ శ్రీనివాసరావు వివాదాస్పద వ్యాఖ్యలు
తెలంగాణ పబ్లిక్ హెల్త్ డైరెక్టర్ గడల శ్రీనివాసరావు సంచలన వ్యాఖ్యలు చేశారు.రంజాన్ మాసం సందర్భంగా కొత్తగూడెంలో నిర్వహించిన ఇఫ్తార్ విందులో పాల్గొన్న ఆయన చిన్నతనంలో తాను తీవ్ర అనారోగ్యానికి గురైనప్పుడు తాయత్తు మహిమ వల్లే బతికానని వ్యాఖ్యానించారు.
5.జగన్ పై సిపిఐ విమర్శలు

తెలంగాణ మంత్రి హరీష్ రావు వ్యాఖ్యలపై ఏపీ సీఎం జగన్ సమాధానం చెప్పాలని, ఈ నాలుగేళ్లలో జగన్ ఏమి సాధించారని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ విమర్శించారు.
6.తిరుమల సమాచారం
తిరుమలలో భక్తుల రద్దీ సాధారణంగా ఉంది.శ్రీవారి సర్వదర్శనానికి భక్తులు మూడు కంపార్ట్మెంట్లలో వేచి ఉన్నారు.
7.భారత్ లో కరోనా

గడిచిన 24 గంటల్లో దేశవ్యాప్తంగా కొత్తగా 9,111 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి.
8.మనీశ్ సిసోడియా కస్టడీ పొడిగింపు
ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో అరెస్ట్ అయ్యి తీహార్ జైల్లో ఉన్న ఆమ్ ఆద్మీ పార్టీ నేత సిసోడియాకు సీబీఐ కోర్టు లో ఈ నెల 27 వరకు , ఈడి కేసులో 29 వరకు కస్టడీని పొడగిస్తూ ఉత్తర్వులు ఇచ్చారు.
9.బీజేపీ వి మతోన్మాద రాజకీయాలు చేస్తోంది

బిజెపి మతోన్మాద రాజకీయాలు చేస్తోందని సీపీఐ నేత చాడ వెంకటరెడ్డి అన్నారు.
10.వైవీ సుబ్బారెడ్డి కామెంట్స్
వైఎస్ వివేకానంద రెడ్డి వివాహేతర సంబంధాల గురించి చెప్పుకుంటే కుటుంబ పరువు పోతుందనే అప్పట్లో చెప్పలేదని వైఎస్ వివేకానందరెడ్డి అన్నారు.
11.కెసిఆర్ కు బండి సంజయ్ లేఖ

నిర్మల్ పట్టణంలో వృత్తి నైపుణ్య శిక్షణ కేంద్రం కోసం కేటాయించిన అటవీ భూములపై బీజెపి తెలంగాణ అధ్యక్షుడు బండి సంజయ్ కేసీఆర్ కు లేఖ రాశారు.
12.జగన్ శ్రీకాకుళం పర్యటన
ఏపీ సీఎం జగన్ రేపు శ్రీకాకుళం జిల్లాలో పర్యటించనున్నారు.
13. విభజన అంశంపై సుప్రీంకోర్టు లో విచారణ

రాష్ట్ర విభజన అంశంపై ఈరోజు సుప్రీంకోర్టులో జరగనుంది.సుప్రీంకోర్టులో పొంగులేటి సుధాకర్ రెడ్డి, కె రఘురామకృష్ణంరాజు, ఉండవల్లి అరుణ్ కుమార్ తదితరులు పిటిషన్ వేశారు.
14.ఏకో ఇండియా తో ఏపీ ప్రభుత్వం ఒప్పందం
ఏకో ఇండియా సంస్థ ఆధ్వర్యంలో విజయవాడలో ఏకో ప్రాజెక్ట్ పై రెండు రోజుల సదస్సు జరుగుతుంది.
ఈ సదస్సులో వైద్య ఆరోగ్య శాఖ ముఖ్య కార్యదర్శి కృష్ణ బాబు తదితరులు పాల్గొన్నారు.ఈ సందర్భంగా కృష్ణ బాబు మాట్లాడుతూ ఏకో ఇండియా సంస్థతో ప్రభుత్వం ఎంఓయూ చేసుకున్నట్టు వెల్లడించారు.
15.సచివాలయ ఉద్యోగులకు గుడ్ న్యూస్

గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది.గతంలో ఉద్యోగాలు పొందిన వారికి ప్రొబేషన్ ఖరారు చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.
16.కొనసాగుతున్న 144 సెక్షన్
ప్రకాశం జిల్లా ఎర్రగొండపాలెం లోని ఇజ్రాయిల్ పేటలో ఘర్షణ నేపథ్యంలో 144 సెక్షన్ ను పోలీసులు కొనసాగిస్తున్నారు.
17.చంద్రబాబు పర్యటన

నేటి నుంచి రెండు రోజులపాటు టిడిపి జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు కడప జిల్లాలో పర్యటించనున్నారు.
18.ప్రగతి పోర్టల్ స్థానంలో సారధి పోర్టల్
రవాణాశాఖ సేవ కోసం ఈ ప్రగతి పోర్టల్ స్థానంలో నేటి నుంచి సారధి పోర్టల్ ను కడప జిల్లా వ్యాప్తంగా అన్ని రవాణా శాఖ కార్యాలయాల్లో అందుబాటులోకి తీసుకువచ్చారు.
19.యువ గళం పాదయాత్ర

నారా లోకేష్ చేపట్టిన యువ గళం పాదయాత్ర నేటికి 74వ రోజుకు చేరుకుంది.కర్నూలు జిల్లా ఆలూరు అసెంబ్లీ నియోజకవర్గంలోని పల్లె దొడ్డి గద్దెరాల, దేవరకొండ , కొంకనూరు, అల్లారు దీన్నే, మీదుగా వలగొండ వరకు లోకేష్ పాదయాత్ర కొనసాగుతుంది.
20.నిరుద్యోగ సత్యాగ్రహ దీక్ష
నేడు ఇందిరా పార్కులో నిరుద్యోగ సత్యాగ్రహ దీక్ష జరుగుతోంది.







