షాకింగ్ కదా.తల్లి ఎవరికైనా తల్లే.
అది మనుషులలో కావచ్చు, పశుపక్ష్యాదులలో కావచ్చు.పిల్లలను తల్లిని మించి ఎవరూ ప్రేమించలేరు.
అలాంటి ఓ తల్లి కొంగ తన గూడులో ఉన్న ముగ్గురు బిడ్డల్లోంచి ఒక బిడ్డను కిందకు విసిరేయడం ఇపుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అయింది.కానీ ఆ తల్లి కొంగ ఎందుకు అలా చేసి ఉంటుంది? అనే విషయం తెలిస్తే మాత్రం ఆ తల్లి కొంగను మీరు మెచ్చుకోక తప్పదు.

విషయానికి వస్తే ఇక్కడ వైరల్ అవుతోన్న వీడియోని గమనిస్తే, ఓ తల్లి కొంగ తన గూడులో ముగ్గురు బిడ్డలలో ఒక పిల్ల కొంగని ఒకదాన్ని ముక్కుతో పట్టుకుని ఎత్తునుంచి కిందకు పడేయడం స్పష్టంగా చూడవచ్చు.తాజాగా ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ కాగా నెటిజన్లు( Netizens ) బావురమంటున్నారు.ఈ దృశ్యం చూసి, వారికి మనసు చలించిపోతుంది.ఆ తల్లి కొంగ( Mother stork ) ఎంతటి కసాయిది అని కోపం కూడా తెచ్చుకుంటున్నారు.అయితే అసలు విషయం తెలిసి వారి అభిప్రాయాన్ని వెనక్కి తీసుకుంటున్నారు.

పడేసిన కొంగ పిల్ల సరైన ఎదుగుదల లేని బిడ్డ కావడంతో.దానివల్ల ఇతర బిడ్డలకు హాని జరుగుతుందనే కారణంతోనే ఆ తల్లికొంగ తన బిడ్డను కిందకు విసిరేసిందని పరిశోధనలో తేలింది.తాజాగా 63 కొంగల గూళ్లలో పరిశోధకులు చేసిన పరిశోధనల్లో 9 గూళ్లలో ఇలాంటి సంఘటనలు జరగడం గమనించారట.
దీనిని బట్టి ఆ తల్లి కొంగ ఎందుకు తన బిడ్డను పడేసిందో అర్ధం చేసుకోవచ్చు.అంటే మిగతా బిడ్డలను కాపాడుకోవడం కోసం ఆ తల్లి కొంగ మనసుని ఎంత దృఢ పరుచుకుని ఈ పనికి పూనుకుందో అర్ధం చేసుకోవచ్చు.







