రష్యాలో చైనా రక్షణ మంత్రి పర్యటన చేస్తుంటే, అమెరికా కంగారు పడుతోంది ఎందుకని?

మొదటినుండి అమెరికా – చైనా స్నేహం కొనసాగిస్తూ వస్తోంది.అయితే అమెరికా ఆంక్షల చట్రంలో ఉన్న చైనా రక్షణ మంత్రి లీ షెంగ్‌ఫూ ఈ ఆదివారం రష్యా అధ్యక్షుడు పుతిన్‌తో భేటీ కావడం జరిగింది.

 If China's Defense Minister Is Visiting Russia, Why Is America Getting Confused-TeluguStop.com

దాంతో అమెరికా అధిష్టానం అవాక్కయింది.లీ షెంగ్‌ఫూ రక్షణ మంత్రిగా బాధ్యతలు చేపట్టాక తొలిసారి చేపట్టిన విదేశీ పర్యటన ఇదే కావడం విశేషం.

ఓ వైపు రష్యాతో సంబంధాల విషయంలో బీజింగ్‌పై పశ్చిమ దేశాలు ఒత్తిడి పెంచుతున్న సమయంలోనే ఈ పర్యటన చోటు చేసుకోవడం ప్రత్యేకతని సంతరించుకుంది.

Telugu America, China, Defense, Latest, Xi, Russia, Vladimir Putin-Latest News -

రష్యాకు చెందిన రొసొబోర్న్‌ ఎక్స్‌పోర్ట్‌ సంస్థతో లావాదేవీలు నిర్వహించినందుకు 2018లో అమెరికా ఆంక్షలు విధించిన సంగతి విదితమే.చైనా ఎస్‌-400లను లీ షెంగ్‌ఫూ హయంలోనే కొనుగోలు చేసింది.మార్చిలో చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్‌ మాస్కోలో పర్యటించిన విషయం అందరికీ తెలిసిందే.

ఆ వెంటనే చైనా విదేశాంగ మంత్రి రష్యా చేరుకోవడం పట్ల అమెరికా ఆందోళన చెందుతోందని విశ్వసనీయ వర్గాల సమాచారం.చైనాతో రష్యా సైనిక సంబంధాలను బలోపేతం చేసుకొంటోందని భావిస్తోంది.

ఉక్రెయిన్‌ యుద్ధం( Russia-Ukraine war )లో రష్యాకు మద్దతుగా ఆయుధ సహకారం అందిస్తుందని అనుమానిస్తోంది అమెరికా.

Telugu America, China, Defense, Latest, Xi, Russia, Vladimir Putin-Latest News -

షెంగ్‌ఫూతో భేటీ సందర్భంగా పుతిన్‌( Vladimir Putin ) మాట్లాడుతూ… గతంలో షీ జిన్‌పింగ్‌ పర్యటన చాలా నిర్మాణాత్మకంగా జరిగిందని పేర్కొన్నారు.సైనిక రంగం సహా అన్ని విభాగాల్లో ఇరు దేశాలు సంబంధాలను బలపర్చుకొంటున్నాయని చెప్పుకొచ్చారు.ఈ క్రమంలో తిరుగులేని విశ్వాసంతో వ్యూహాత్మక సంబంధాలు మెరుగుపర్చుకొంటున్నట్లు పుతిన్‌ వెల్లడించడంతో అమెరికా గుండెల్లో గుబులు మొలయ్యింది.

Telugu America, China, Defense, Latest, Xi, Russia, Vladimir Putin-Latest News -

ఇకపోతే తాజాగా అమెరికా నౌకాదళం సెవెన్త్‌ ఫ్లీట్‌కు చెందిన గైడెడ్‌ మిసైల్‌ డెస్ట్రాయర్‌ యూఎస్‌ఎస్‌ మిలియస్‌ జలసంధిని దాటింది.స్వేచ్ఛాయుత ఇండో-పసిఫిక్‌కు అమెరికా కట్టుబడి ఉందని ఈ సందర్భంగా పేర్కొన్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube